TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విజయసాయి పెట్టబోయే కొత్త పార్టీ: చేరబోయే కొత్త నేత.. ఎవరో తెలుసా.?

Published on: Mon Nov 2, 2026 2:27PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు ఓవీ రమణ టీటీడీ రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి పెట్టబోయే కొత్త పార్టీలో చేరనున్నారు. రాబోయే పార్టీలో చేరబోయే తొలి నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. విజయసాయి పెట్టబోయే కొత్త పార్టీలో చేరేందుకు ఆయన తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తాననీ,   రాజీనామా చేయడమే కాదు, తాను విజయసాయి రెడ్డితో కలిసి కొత్త రాజకీయ అడుగులు వేయనున్నట్లు ప్రకటించారు.   గతంలో తిరుపతి పర్యటన సందర్భంగా విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీలోకి ఓవీ రమణను బహిరంగంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ఆయన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. 

కాగా ఈ ఇరువురి మధ్యా   సుదీర్ఘ  రాజకీయ అనుబంధం ఉంది. గతంలో వీరిరువురూ   టీటీడీ పాలకమండలి సభ్యులుగా కలిసి పనిచేశారు. ఆ పరిచయం,  కారణంగానే ఇప్పుడు కొత్త రాజకీయ ప్రయాణంలోనూ కలిసి సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతి ప్రాంతీయ రాజకీయాల్లో ఓవీ రమణకు బలమైన పట్టు ఉంది. ఆ కారణంగానే ఓవీ రమణ విజయసాయితో కలిసి కొత్త రాజకీయపార్టీలో కలిసి పని చేస్తారన్న వార్త పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. 

విజయసాయి తన కొత్త రాజకీయ పార్టీ తెలుగుదేశం, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని చెబుతున్నారు.  త్వరలో పార్టీ ఆవిర్భావ వేడుక నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ ఆవిర్భావ వేడుకల్లోనే ఓవీ రమణ చేరికకు సంబంధించిన లాంఛనం పూర్తి అవుతుందని పరిశీలకులు అంటున్నారు.  

[OV Ramana Resign TDP, Join, Vijayasai Reddy New Party, Andhra Pradesh Politics, TTD Board Former Member, Telugu One]