Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...క్లాసిన్ క్లాసిక్ ఇన్నింగ్స్.. వాంఖడేలో ఎస్ఆర్ హెచ్ చేతిలో ముంబై చిత్తు
posted on: Apr 30, 2026 6:45AM
.webp)
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబైలోని చారిత్రక వంఖేడే స్టేడియం వేదికగా బుధవారం (ఏప్రిల్ 29) జరిగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయాన్ని అందుకుంది. పరుగుల వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను వారి సొంత గడ్డపైనే చిత్తు చేస్తూ ఆరెంజ్ ఆర్మీ సత్తా చాటింది. కీలకమైన ఈ పోరులో సన్‌రైజర్స్ బ్యాటర్లు లో విరుచుకుపడి భారీ లక్ష్యాన్ని ఛేదించి, ప్లేఆఫ్స్ దిశగా మరో అడుగు ముందుకేశారు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 243 పరుగుల భారీ స్కోరును సాధించింది. ముంబై ఓపెనర్ రియాన్ రికెల్టన్ స్టేడియంలో సిక్సర్ల సునామీ సృష్టించాడు. కేవలం 44 బంతుల్లోనే శతకాన్ని బాది, ముంబై ఇండియన్స్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రికెల్టన్ 123 పరుగులతో అజేయంగా నిలిచి ముంబైకి కొండంత స్కోరును అందించాడు. అతనికి తోడుగా విల్ జాక్స్ ఆరంభంలో మెరుపులు మెరిపించడంతో ముంబై భారీ స్కోరు దిశగా సాగింది.
అయితే.. 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏమాత్రం తడబడలేదు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మరోసారి జట్టుకు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ ప్లేలో ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగి రన్ రేట్‌ను ఆకాశానికి తీసుకెళ్లారు. ట్రావిస్ హెడ్ తనదైన శైలిలో బౌండరీల వర్షం కురిపించగా, మిడిల్ ఓవర్లలో హెన్రిచ్ క్లాసెన్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ముంబై బౌలర్ల వ్యూహాలను చిత్తు చేస్తూ క్లాసెన్ ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్‌ను హైదరాబాద్ వైపు తిప్పింది.
చివరి ఓవర్లలో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారినప్పటికీ, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ సమన్వయంతో ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా సహా బౌలర్లందరూ విఫలమయ్యారు. చివరికి సన్‌రైజర్స్ 244 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంకా ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ఛేదించి 6 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది.
ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబైకి ఈ మ్యాచ్ గెలవడం అత్యంత ఆవశ్యకం అయినప్పటికీ, క్లాసెన్ విధ్వంసం ముందు వారి పోరాటం సరిపోలేదు. మరోవైపు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ వరుస విజయాల పరంపరను కొనసాగిస్తూ పాయింట్ల పట్టికలో టాప్3కి చేరింది.






