TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉల్లి, వెల్లుల్లి ధరలు పైపైకి.!

Published on: Fri Sep 4, 2026 9:46AM

ధరల మంట సామాన్యుడి వంట గదిలో చిచ్చు పెడుతోంది. సామాన్యుడి రోజు వారీ ఆహారంలో అత్యంత కీలక పాత్ర పోషించే  ఉల్లి, వెల్లుల్లి, అల్లం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రోజుల వ్యవధిలోనే వీటి ధరలు విపరీతంగా పెరగడం పట్ల సామాన్యులలో ఆందోళన వ్యక్తమౌతోంది.    నెల రోజుల కిందటి  వరకూ  క్వింటాల్  రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.

 అదే విధంగా  అల్లం,  వెల్లుల్లి ధరలు కూడా  విపరీతంగా పెరిగాయి. క  అల్లం క్వింటాల్ రూ. 16 వేలకు వెల్లుల్లి క్వింటాల్   రూ. 19 వేలకు పెరిగింది.  దీంతో రిటైల్ మార్కెట్‌లో కిలో వెల్లుల్లి ధర   250 రూపాయలు దాటిపోయింది.  వాతావరణ మార్పులు, యు వర్షాభావ పరిస్థితుల కారణంగా  దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడమే ఈ ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

  గత జూన్, జులై నెలల్లో మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలు ఉల్లి  దెబ్బతీశాయి. మరోవైపు, కర్ణాటకతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉల్లి సాగు విస్తీర్ణం బాగా తగ్గింది.  సాధారణంగా రోజుకు 20 వేల క్వింటాళ్ల సరుకు రావాల్సిన మలక్‌పేట మార్కెట్‌కు, ప్రస్తుతం   5 వేల క్వింటాళ్లు మాత్రమే దిగుమతి అవుతోంది. దీంతో డిమాండ్ కు సప్లైకు అంతరం బాగా పెరిగి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.  ఈ ధరల పెరుగుదల ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.  

[Onion prices High, ginger and garlic rates, Malakpet market, kitchen budget, rise in vegetable prices, Telugu One]