TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల హుండీలో రూ.400 కోట్ల పాత నోట్లు

Published on: Tue Apr 7, 2026 10:31AM

మొక్కుకు మొక్కూ తీర్చుకున్నట్లౌతుంది, అలాగే తమ వద్ద ఉన్న పాత నోట్లను వదిలించుకున్నట్లూ అవుతుందని భావిస్తున్నట్లున్నారు భక్తులు. తిరుమల శ్రీవారి హుండీలో భక్తులు   రద్దైన పాత 500, 1000 రూపాయల నోట్లు ఇప్పటికీ వేస్తూనే ఉన్నారు. తిరుమల శ్రీవారి హుండీలో పాత రద్దైన నోట్ల ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన పాత రద్దైన నోట్ల పోగుపడ్డాయి. కాదు కాదు పేరుకుపోయాయి.

కేంద్రం, అలాగే ఆర్బీఐ కూడా వీటి మార్పిడిని అనుమతించకపోవడంతో ఇవి నిరుపయోగంగా మిగిలిపోయాయి.  అయితే భక్తులు మాత్రం కేంద్రం వీటిని వృధాగా మిగిలిపోనీయకుండా మార్పిడికి అనుమతించాలని కోరుతున్నారు.

రద్దైన రెండు వేలరూపాల నోట్లను ఇప్పటికీ ఆర్బీఐ మార్పిడి చేసుకోవడానికి అనుమతిస్తున్న సంగతిని గుర్తు చేస్తూ రద్దైన 500, 1000 రూపాయల నోట్లను కూడా అలా మార్పిడి చేసుకునే అవకాశం టీటీడీకి ఇవ్వాలనిభక్తులు కోరుతున్నారు. ఈ విషయంపై కేంద్రం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.