TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జెన్సన్ హవాంగ్ పునర్నియామకం: ఎన్విడియో షేర్ల ర్యాలీ.. భారీగా పెరిగిన ట్రంప్ సంపద.!

Published on: Tue Nov 24, 2026 2:11PM

ఏఐ  చిప్‌సెట్ల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థ ఎన్విడియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా జెన్సన్ హువాంగ్ మళ్లీ బాధ్యతలు చేపట్టడం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక, సాంకేతిక వర్గాల్లో   చర్చనీయాంశంగా మారింది. ఆయన పునరాగమన ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే ఎన్విడియా షేర్లు   30 శాతానికి పైగా లాభపడ్డాయి. దీని వల్ల అగ్రరాజ్యాధినేత  డొనాల్డ్ ట్రంప్‌కు కూడా భారీ ఆర్థిక లబ్ధి చేకూరింది.  ఇటీవల ట్రంప్ వెల్లడించిన వివరాల ప్రకారం ఎన్విడియాలో ఆయనకు గరిష్ఠంగా 3.70 లక్షల షేర్లు ఉండగా, తాజా షేర్ల ర్యాలీతో వాటి విలువ ఒక్క రోజులోనే సుమారు 15 మిలియన్ డాలర్లు  పెరిగినట్లు అంచనా. 

సోమవారం (నవంబర్ 23) ఎన్విడియా డైరెక్టర్ల బోర్డు సంస్థ సీఈవోగా జెన్సన్‌ను పునర్నియమిస్తూ తీసుకున్న నిర్ణయం మార్కెట్లలో అనూహ్య స్పందనకు దారితీసింది. ఈ పరిణామం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా తనపై దాడి జరిగినప్పటి ఆహార్యాన్ని పోలి ఉండేలా తన ఐకానిక్ ఫొటోను మార్ఫింగ్ చేసి, జెన్సన్ రాకకు స్వాగతం పలుకుతూ ఆయన షేర్ చేసిన పోస్టు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

మరోవైపు..  సంస్థలోకి తిరిగి వచ్చిన గంటల వ్యవధిలోనే జెన్సన్ హువాంగ్ సంపద కూడా భారీగా పెరిగింది. అమెరికా మార్కెట్లు ముగిసే సమయానికి ఆయన వాటా షేర్ల విలువ ఒక్క రోజులోనే 34 బిలియన్ డాలర్ల మేర  పెరిగింది. ఫోర్బ్స్ రియల్‌టైమ్ బిలియనీర్స్ అంచనాల ప్రకారం, ఈ పెరుగుదలతో జెన్సన్ నికర సంపద 144 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఎన్విడియాలో ఆయనకు గణనీయమైన వాటా ఉండటమే ఈ భారీ లాభానికి కారణం.  ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, అమ్మకాల ఒత్తిడి కారణంగా ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితాలో 10వ స్థానం నుంచి 18వ స్థానానికి పడిపోయిన జెన్సన్ హువాంగ్, తాజా షేర్ల దూకుడుతో   13వ స్థానానికి ఎగబాకారు. కార్పొరేట్ నాయకత్వ మార్పులు, కీలక నిర్ణయాలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఎంత వేగంగా ప్రభావితం చేస్తాయో ఈ పరిణామం మరోసారి చూపించింది.

ఎన్విడియా సీఈవోగా జెన్సన్ పునర్నియామకం ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపడంతో సంస్థలోకి భారీగా పెట్టుబడులు ప్రవహించాయి. ఫలితంగా ఒక్క రోజులోనే సంస్థ మార్కెట్ విలువ 1 ట్రిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 92 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది.  ఎన్విడియా ర్యాలీ ప్రభావం ఇతర టెక్నాలజీ షేర్లపైనా పడింది. చిప్‌మేకర్లు, ఏఐ మౌలిక సదుపాయాల సంస్థలు, సాఫ్ట్‌వేర్ కంపెనీల షేర్లు లాభపడటంతో నాస్‌డాక్ సూచీలో జోరు కనిపించింది. నాస్‌డాక్ 100 మార్కెట్ క్యాపిటలైజేషన్‌కు సుమారు 2 ట్రిలియన్ డాలర్లు అదనంగా చేరినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.

ఇది కూడా చదవండి:  NVIDIA సీఈవో పదవికి జెన్సన్ హువాంగ్ రాజీనామా.. అసలు కారణం ఇదేనా.!​

 ఏఐ  రంగంలో వేగంగా మారుతున్న సాంకేతిక, వాణిజ్య పోటీ నేపథ్యంలో అగ్రగామి చిప్ సంస్థల నాయకత్వ నిర్ణయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు, విశ్లేషకులు నిశితంగా గమనిస్తున్నారు. ఒకే రోజులో ట్రిలియన్ డాలర్ల స్థాయిలో మార్కెట్ విలువ పెరగడం టెక్ రంగంలో ఉన్న పెట్టుబడుల వేగాన్ని, ఆసక్తిని ప్రతిబింబిస్తోంది. రానున్న రోజుల్లో ఎన్విడియా వ్యాపార వ్యూహాలు, కొత్త ఉత్పత్తులు, ఏఐ రంగంలో సంస్థ అడుగులు ఎలా ఉంటాయనే దానిపై మార్కెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. షేర్ల విలువలో వచ్చిన ఈ భారీ  , ర్యాలీ రాబోయే సెషన్లలో ఇదే వేగంతో కొనసాగుతుందా లేక మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనవుతుందా అనేది చూడాల్సి ఉంది. 

మొత్తంగా చూస్తే, జెన్సన్ హువాంగ్ పునర్నియామకంతో ఎన్విడియా షేర్లలో వచ్చిన ర్యాలీ ట్రంప్ వాటా విలువ, జెన్సన్ సంపద, సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో పాటు టెక్నాలజీ రంగానికి కొత్త ఊపునిచ్చింది. మార్కెట్ల తదుపరి కదలికలు, సంస్థ వ్యూహాత్మక నిర్ణయాలపై అంతర్జాతీయంగా ఆసక్తి వ్యక్తమౌతోంది.

మీకు నచ్చవచ్చు:  11 రోజులకే రీఎంట్రీ.. మళ్లీ NVIDIA సీఈవోగా జెన్సన్ హువాంగ్.!

ఆమెతో వివాహేతర సంబంధం నిజమే.. సంచలన విషయం అంగీకరించిన ఎన్విడియా సీఈఓ.!

[Nvidia CEO, REentry, Jensen Huang, Donald Trump, AI chip company, Nasdaq rally, shares,Value, High, TeluguOne]