బాల‌కృష్ణ దంప‌తులు  ఆరంభించిన ఎన్టీఆర్ ఆరోగ్య‌ర‌థం

ఆంధ్రప్ర‌దేశ్‌లో ఆస్పత్రులు, రోగుల సంర‌క్ష‌ణ విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్ అనేకానేక విమ‌ర్శ‌లు విమ ర్శ లు ఎదుర్కొంటున్న‌ది. ఆస్ప‌త్రుల‌కు వెళ్లే రోగుల‌కు ఆరోగ్య‌శ్రీ ర‌క్షణ‌గా ఉంటుంద‌ని ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌కటించిన ప్రభుత్వం ఆ త‌ర్వాత దాన్ని అస‌లు ఆస్ప‌త్రులు ఆద‌రిస్తున్న‌దీ లేనిదీ కూడా ప‌ట్టిం చుకోవడం మానేశారు. ఆరోగ్య‌శ్రీ విష‌యంలో ఆస్ప‌త్రులు రోగుల ప‌ట్ల సానుకూల స్పంద‌న ఇవ్వ‌డం లేదు. చాలాకాలం నుంచే ప్ర‌భుత్వ ఆరోగ్య ప‌థ‌కాల‌కు ఆస్ప‌త్రుల నుంచి గ‌ట్టి మ‌ద్ద‌తు ఉంద‌నే అభి ప్రాయాలు, ప్ర‌చారాలు కేవ‌లం అక్క‌డికే ప‌రిమితం అయ్యాయి. ఈ స‌మ‌యంలో ప్ర‌జారోగ్యానికి ర‌క్ష‌ణ క‌ల్పించే విధం గా టీడీపీ సీనియ‌ర్ నేత‌, సినీ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ దంప‌తులు బుధ‌వారం (ఆగ‌ష్టు 17)న ఎన్టీ ఆర్ ఆరోగ్య‌ర‌థం ఆరంభించారు. 

హిందూపురం మండ‌ల ప‌రిధిలోని చ‌లివెందుల గ్రామంలో ఈ ర‌థాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ ర్భంగా మాట్లాడుతూ బాల‌కృష్ణ‌, రూ.40 ల‌క్ష‌ల వ్య‌యంతో ఈ ర‌థాన్ని రూపొందించామ‌న్నారు. ఇందులో మొబైల్ క్లినిక్ అన్ని వైద్య వ‌స‌తులూ ఉన్నాయ‌న్నారు. 200 వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోను వీలుంద‌ని, మందులు ఉచితంగా అంద‌జేస్తామ‌న్నారు. 

ప్రభుత్వాస్పత్రుల్లో పరికరాలను ఉపయోగించకుండా పక్కన పడేయడం సిగ్గుచేటని బాలకృష్ణ అన్నా రు. ఇంక్యుబేటర్లు పక్కన పడేశారని, సిగ్గు.. శరం ఉన్నవాళ్లు ఆలోచించాలన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య రథా న్ని పార్టీలకతీతంగా అందించామని, మనిషిని మనిషిగా గౌరవించాలని, తెలుగువారి ఆత్మగౌరవం కోస మే తెలుగుదేశం పార్టీ పుట్టిందన్నారు. ఒక్క హిందూపురం, మంగళగిరి మాత్రమే కాదని.. రాష్ట్రం మొత్తం వైద్య సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. ఎవరైనా వాహనానికి అపకారం చేస్తారేమోనని సీసీటీవీ పెట్టించామన్నారు. హిందూపురంను ఆరోగ్యపురంగా చేయాలన్నదే తమ అందరి ధ్యేయమని బాలకృష్ణ స్పష్టం చేశారు.