అంతా ఏకాభిప్రాయమే: కమిషనర్ల మధ్య విభేదాలు లేవు.. సుప్రీంలో ఈసీఐ అఫిడవిట్.!
Published on: Tue Oct 27, 2026 10:19AM

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు, అభిప్రాయ బేధాలు లేవని ఈసీఐ పేర్కొంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియకు సంబంధించి సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘంఈ మేరకు కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. సంస్థ తీసుకున్న ప్రతి నిర్ణయం ఏకగ్రీవంగానే జరిగిందని, ఇందులో ఎలాంటి ఏకపక్ష ధోరణికి తావులేదని ఈ అఫిడవిట్ లో పేర్కొంది. కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు, సీఈసీ ఏకపక్ష నిర్ణయాలు అంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై స్పందిస్తూ ఈసీఐ తమ వాదనలను లిఖితపూర్వకంగా అందజేసింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్లు కూడా ఈ అఫిడవిట్‌ను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ఈసీ వెల్లడించింది. గతంలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి జూన్, అక్టోబర్, మే నెలల్లో జారీ చేసిన మూడు ఉత్తర్వులూ ఏకగ్రీవంగానే జరిగాయని స్పష్టం చేసింది. అంతర్గత చర్చల సమయంలో సభ్యులు లేవనెత్తిన సందేహాలను భిన్నాభిప్రాయం, అభిప్రాయ బేధంగా పరిగణించలేమని కేంద్ర ఎన్నికల సంఘం తన అఫిడవిట్ లో పేర్కొంది.
ఫైళ్ల కదలికకు సంబంధించిన విధివిధానాలను వివరిస్తూ, సాధారణంగా ప్రతి ఫైల్ ఒక కమిషనర్ నుంచి మరొక కమిషనర్‌కు చేరి, చివరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ పరిశీలనకు వెళ్తుందని పేర్కొన్న ఈసీ.. అత్యవసర పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ విధానంలో అనుమతులు తీసుకుని, ఆ తర్వాత వాటిని ఫైల్లో రికార్డు చేస్తామని పేర్కొంది. అలాగే, ఫైళ్ల ప్రాసెసింగ్ సమయంలో అధికారుల మధ్య జరిగే సాధారణ ఉత్తరప్రత్యుత్తరాలను కమిషనర్ల మధ్య భేదాభిప్రాయాలుగా భావించలేమని స్పష్టం చేసింది.
.webp)
ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫారం-6 విషయంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఆ ఫారంలో ఎలాంటి చట్టపరమైన మార్పులు చేయలేదని, దాన్ని సవరించే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని తెలిపింది.
[No Differences Election Commission Affidavit, Supreme Court India, Special Intensive Revision SIR, Chief Election Commissioner, ECI Counter Affidavit, Telugu One]


