TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇరాన్ పై దాడులకు అమెరికా ఫుల్ స్టాప్.. కానీ.!

Published on: Wed Aug 26, 2026 10:01AM

దాడు చేపట్టబోమని అగ్రరాజ్యం  మధ్య ప్రాచ్య  పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ, తమ వైఖరిని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేయడంతో ఉద్రిక్తతలు ఒకింత తగ్గినట్ల యుద్ధ నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ పై ఇప్పట్లో కొత్త దాడులేవీ ఉండవని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తమ మిత్రదేశాలకు  అఫీషియల్ గా తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో  వైమానిక,  క్షిపణి దాడుల కంటే వ్యూహాత్మక చర్యలకే మొగ్గు చూపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. 
అయితే.. ఈ దాడుల విరమణకు షరతులు ఉన్నాయని స్పష్టం చేశారు.   ఇరాన్ లేదా  ఆ దేశానికి మద్దతుగా ఉన్న  దళాలు  అమెరికా, అమెరికా మిత్రదేశాలపై దాడులకు పాల్పడితే... ఈ సారి ప్రతీకార దాడులు తీవ్రాతి తీవ్రంగా ఉంటాయని మార్కో రూబియో హెచ్చరించారు.  

అదలా ఉంటే..  ప్రత్యక్ష దాడులను నిలిపివేసినప్పటికీ, ఇరాన్ పై ఆర్థిక ఆంక్షలను   తీవ్రం చేసింది. ఇరాన్‌కు అంతర్జాతీయ వ్యాపార సంబంధాలు తెగిపోయేలా 'ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్' పేరిట భారీ స్థాయిలో ఆర్థిక ఆంక్షలను ప్రకటించింది. ఇందులో భాగంగా ఇరాన్‌కు చెందిన సుమారు 60 సంస్థలు, పలువురు కీలక వ్యక్తులు,  వాణిజ్య నౌకలను  తాజాగా బ్లాక్ లిస్ట్ లో చేర్చింది.   ఇరాన్ సైనిక వ్యూహాలకు నిధులు సమకూరకుండా చేయడం,  ఆ దేశ పెట్రోలియం, పెట్రోకెమికల్ ఎగుమతులను  అడ్డుకోవడమే ఈ ఆంక్షల ముఖ్య ఉద్దేశమని అమెరికా  స్పష్టం చేసింది. 

అలాగే   హర్మూజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ ఓడరేవుల నుండి నౌకల రాకపోకలను నియంత్రించేందుకు అమెరికా నౌకాదళం దిగ్బంధాన్ని కొనసాగిస్తోంది. సముద్ర మార్గంలో సైతం ఇరాన్ చేసే వాణిజ్య కార్యకలాపాలను అడ్డుకోవడం ద్వారా ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహంతో అమెరికా ముందుకు సాగుతోంది.

 పశ్చిమాసియాలో పూర్తి స్థాయి యుద్ధాన్ని నివారించేందుకే అమెరికా ఈ నిర్ణయం తీసుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  దాడులు ఉండబోవన్న అమెరికా ప్రకటన ఇరాన్ కు ఏమంత ఉపశమనం కలిగించే అవకాశం లేదంటున్నారు. ఎందుకంటే.. దాడులైతే ఉండవని ప్రకటించింది కానీ, అదే సమయంలో మరింత కఠిన ఆంక్షల పంజా విసరడంతో ఇరాన్ వేగంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి చేతులెత్తేయాల్సిన పరిస్థితి వస్తుందని అంటున్నారు.  

No attacks on Iran, America, US-Iran crisis, US sanctions on Iran, Marco Rubio, West Asia tensions