TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేంద్ర మంత్రి గడ్కరీ రిటైర్మెంట్?

Published on: Wed Aug 26, 2026 11:52AM

నితిన్ గడ్కరీ రాజకీయాల నుంచి రిటైర్ కానున్నారా?  యువతకు అవకాశాలివ్వాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాలలో సంచలనంగా మారాయి. కేంద్ర  మంత్రి నితిన్ గడ్కరీ రాజకీయాల నుంచి వైదొలగనున్నారా అన్న చర్చ ఇప్పుడు జాతీయ రాజకీయాలలో జోరుగా సాగుతోంది. బీజేపీలో  చాలా కాలంగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రధాని మోడీ కేబినెట్ లో కీలక పోర్ట్ పోలియో నిర్వహిస్తున్న నితిన్ గడ్కరీ తాజాగా  యువతకు అవకాశాలివ్వాలంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడీ ప్రచారానికి, చర్చకు  కారణమయ్యాయి. మరీ ముఖ్యంగా త్వరలో ప్రధాని మోడీ తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించున్నారన్న వార్తల నేపథ్యంలో గడ్కరీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  

 మూడు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో నిరంతరం పనిచేస్తున్న తాను..  ఇకపై గతంలోలా  శ్రమించలేకపోవచ్చన్న గడ్కరీ,  రాజకీయాల్లో నూతన తరానికి అవకాశాలివ్వాల్సిన సమయం వచ్చేసిందనీ పేర్కొన్నారు.   సీనియర్ నాయకులు వారికి  మార్గదర్శకులుగా, సలహాదారులుగా మాత్రమే వ్యవహరించాలన్న అభిప్రాయం గడ్కరీ వ్యక్తం చేశారు. ఆయన ఈ వ్యాఖ్యలు తన రాజకీయ రిటైర్మెంట్ గురించే కాకుండా సుదీర్ఘంగా పార్టీలో ప్రభుత్వంలో కీలక హోదాల్లో ఉన్న నేతలందరినీ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మూడు దశాబ్దాల  రాజకీయ అనుభవం ఉన్నగడ్కరీ.. ఇకపై  పాత వేగంతో పనిచేయడం కష్టమని బహిరంగంగా చెప్పడంతో ఆయన పొలిటికల్ రిటర్మెంట్ పై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కెబినెట్ పునర్వ్యవస్థీకరణ తెరపై ఉన్న సమయంలో గడ్కరీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వేడిని రగిలించాయి.  

Nitin Gadkari etirement from politics,  Union Minister, Gadkari Retirement Speculations, Cabinet Expansion, Indian Politics