నీతా అంబానీ భరతనాట్యం.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆహార్యం.!
Published on: Tue Nov 24, 2026 11:15AM

ముంబైలోని నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ) వేదికగా జరగనున్న ప్రదర్శన కోసం నీతా అంబానీ భరతనాట్యం రిహర్సల్స్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రోజ్ పింక్ రంగు లెహంగా ధరించి, కాళ్లకు గజ్జెలు కట్టుకుని ఆమె సాధన చేసిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్ సివిలైజేషన్ టు నేషన్ పేరుతో రూపొందుతున్న ఈ ప్రదర్శన ఇండియా సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూనే ఆధునిక దేశంగా ఎదిగిన ప్రయాణాన్ని ఆవిష్కరించనుంది. నీతా అంబానీ రిహార్సల్ వీడియో ఈ నెల 21న స్వదేశ్ ఆన్లైన్ ద్వారా విడుదలై విశేష ఆదరణ పొందింది.
ఈ రిహర్సల్ వీడియోలో నీతా అంబానీ ఎంతో ఏకాగ్రతతో నృత్య సాధన చేస్తూ కనిపించారు. ఆమెకు భరతనాట్యం కొత్తేమీ కాదని, చిన్న వయసు నుంచే ఆమె ఈ శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందారు. కేవలం ఒక నిర్దిష్ట కార్యక్రమం కోసం చేస్తున్న ప్రయత్నంగా కాకుండా, ఎన్నో ఏళ్లుగా తనలో ఉన్న కళాభిమానానికి ఇది మరో నిదర్శనంగా నిలుస్తోందనీ విడియో చూసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు. వ్యాపార, సేవా బాధ్యతల మధ్య కూడా తనకు ఇష్టమైన కళ కోసం సమయాన్ని కేటాయిస్తూ సాధన చేయడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రస్తుతిస్తున్నారు.
వీడియోలో అందరి దృష్టిని ఆకట్టుకున్న మరో ప్రధాన అంశం ఆమె ధరించిన సంప్రదాయ వస్త్రధారణ. రోజ్ పింక్ లెహంగాపై సున్నితమైన బంగారు వర్ణపు బూటీలు, దానికి ఎరుపు, బంగారు రంగుల జరీ బోర్డర్ ప్రత్యేక శోభను తెచ్చాయి. చీర కొంగు తరహాలో అమర్చిన పట్టి దుప్పట, ఎరుపు, బంగారు అంచులతో కూడిన హాఫ్ స్లీవ్ బ్లౌజ్ ఆమె నృత్య వస్త్రధారణకు మరింత అందాన్ని చేకూర్చాయి.

నృత్య ప్రదర్శనకు తగినట్లుగా నీతా అంబానీ ఎంచుకున్న ఆభరణాలు, అలంకరణ కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చెవులకు జుంకాలు, చేతులకు గులాబీ ముత్యాలు, బంగారు రంగులతో కూడిన గాజులు, వేలికి పూల ఆకృతిలో ఉన్న ఉంగరం ఆమె లుక్కు సంప్రదాయ సొబగు అద్దాయి. వీటితో పాటు కళ్లకు కాటుక, నుదిటిపై మెరూన్ రంగు బొట్టు, సాధారణ కేశాలంకరణతో ఆమె ఆహార్యం సంప్రదాయానికి పెద్దపీట వేసింది. శాస్త్రీయ నృత్యాల్లో వస్త్రధారణ, అలంకరణలకు ఉండే ప్రాధాన్యానికి ఇది అద్దం పడుతోంది.
ఇది కూడా చదవండి: నీతా అంబానీ తాగే వాటర్ బాటిల్ ధర తెలుసా? ఆ డబ్బుతో లైఫ్ సెట్ చేసుకోవచ్చు!
వ్యాపార సామ్రాజ్యం, ప్రపంచ స్థాయి సేవా కార్యక్రమాలతో పాటు భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు అంతర్జాతీయ వేదిక కల్పించాలనే ఆలోచనతో నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్ స్థాపించారు. భారతీయ సంగీతం, నృత్యం, నాటకం వంటి కళారూపాలను ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేయడంలో ఈ సాంస్కృతిక కేంద్రం కీలక పాత్ర పోషిస్తోంది. కళలను ప్రోత్సహించడంతో పాటు అదే వేదికపై నీతా అంబానీ స్వయంగా భరతనాట్యం ప్రదర్శించడానికి సిద్ధమవడం దేశ సంస్కృతీ, సంప్రదాయాల పట్ల ఆమెకున్న మక్కువకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

భరతనాట్యం నుంచి కథక్ వరకు, కర్ణాటక సంగీతం నుంచి హిందుస్తానీ సంగీతం వరకు భారతదేశ వేల సంవత్సరాల సాంస్కృతిక వారసత్వాన్ని నేటి తరానికి పరిచయం చేయడం అవసరమనే భావనతో ఈ మ్యూజికల్ ప్రదర్శన రూపొందుతోంది. కేవలం వినోద కార్యక్రమానికే పరిమితం కాకుండా, మన మూలాలు, సంప్రదాయాలు, కళల విలువను గుర్తుచేసే వేడుకగా ఇది నిలవనుందని పేర్కొన్నారు. సంపద, హోదా, పేరు ప్రతిష్టలతో పాటు మన సంస్కృతి, కళలు మన గుర్తింపును నిలబెడతాయనే సందేశాన్ని ఈ ప్రదర్శన ద్వారా చాటి చెప్పే ప్రయత్నం జరుగుతోందని నీతా అంబానీ వివరించారు.
మీకు నచ్చవచ్చు : స్టార్‌లింక్ వర్సెస్ జియో: ఎలాన్ మస్క్ సవాల్‌ను ముఖేష్ అంబానీ ఎదుర్కొంటారా?
స్టార్ లింగ్ ఇండియా ఎంట్రీ: మస్క్ ప్రధాని అంబానీ సెటైర్లు.. ఒత్తిడి వ్యూహం ఫలిస్తుందా.?
[Nita Ambani, Bharatanatyam Rehearsals, Nita Mukesh Ambani Cultural Centre, Great Indian Musical, Civilization to Nation, TeluguOne]


