TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఐదో వన్డేలో టీమ్ ఇండియా విజయం: సిరీస్ కైవసం.!

Published on: Sun Nov 15, 2026 3:19PM

న్యూజిలాండ్ తో జరిగిన ఐదు వన్డేల సిరీస్ ఇండియా కైవసం చేసుకుంది. ఆదవారం జరిగిన చివరి ఐదో మ్యాచ్ లో టీమ్ ఇండియా 22 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించి సిరీస్ ను 3-1 తేడాతో సొంతం చేసుకుంది.  నాలుగో వన్డేలో బ్యాటర్ల వైఫల్యంతో కేవలం 89 పరుగులకే ఆలౌట్ అయ్యి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టీమ్ ఇండియా ఐదో వన్డేలో ఒకింత మెరుగ్గా ఆడింది. 

ఈ మ్యాచ్ లోతొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా బ్యాటర్ల వైఫల్యం కారణంగా 209 పరుగులకే ఆలౌట్ అయ్యింది.  నిర్ణీత 50 ఓవర్లూ కూడా ఆడలేక 42.1 ఓవర్లకే 209 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బ్యాటర్లలో అక్షర్ పటేల్  55 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ తో 46 పరుగులు, అలాగే ఇషాన్ కిషన్  58 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో 46 పరుగులు చేయడంతో భారత్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్లీ విఫలమయ్యారు.

ఇక  210 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ ను భారత బౌలర్లు కట్టడి చేశారు.  అర అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టాడు.  కీలక సమయాల్లో అర్షదీప్ సింగ్ వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ ను దెబ్బ తీశారు. ఇంకా మహ్మద్ సిరాజ్ కూడా రాణించి రెండు కీలక వికెట్లను పడగొట్టాడు. దీంతో న్యూజిలాండ్ 48.1 ఓవర్లలో  187 పరుగులకు ఆలౌట్ అయ్యింది.  

[NewelandvsIndia, 5thODI, TeamIndiawin, Seriswin, TeluguOne]