స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. నా భర్త అమాయకుడంటున్నపూర్ణచందర్ భార్య

తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ భార్య స్వప్న   తెరపైకి వచ్చి సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త అమాయకుడని, అసలు బాధితురాలు తనేనంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ కేసులో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి.  స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో నిందితుడైన  పూర్ణచందర్‌ను వెనకేసుకొస్తూ ఆయన భార్య స్వప్న మాట్లాడారు. తన భర్త ద్వారానే స్వేచ్ఛ తనకు పరిచయమైందనీ, అప్పుడు వారిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి తనకు తెలియదని చెప్పిన స్వప్న, ఆ తరువాత వారి మధ్య ఎఫైర్ తెలిసి భర్తకు దూరమయ్యానని వివరించారు.  

అంతేకాకుండా..  స్వేచ్ఛ తనను మానసికంగా  వేధించిందని స్వప్న ఆరోపించారు. అదే విధంగా పూర్ణచందర్‌ను స్వేచ్ఛ బ్లాక్‌మెయిల్ చేసిందని, తన పిల్లలను కూడా "అమ్మా" అని పిలవాలంటూ భయపెట్టిందని చెప్పారు. స్వేచ్ఛ కుమార్తె అరణ్య తన భర్తపై చేస్తున్న ఆరోపణల్లో ఇసుమంతైనా నిజం లేదని స్వప్నచెప్పిన స్వప్న పూర్ణచందర్ అరణ్యను సొంత కూతురిలాగే చూసుకున్నాడన్నారు.  నిందితుడి భార్య మృతురాలిపై ఆరోపణలు చేయడం ఈ కేసు దర్యాప్తులో ఈ వ్యాఖ్యలు కీలకంగా మారే అవకాశం ఉంది.