TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నేపాల్ వరదల్లో అద్భుతం.. 9 రోజుల పాటు శిథిలాల కింద సజీవంగా.!

Published on: Fri Sep 4, 2026 2:13PM

ప్రకృతి భీభత్సం సృష్టించినప్పుడు కొన్నిసార్లు  నమ్మశక్యం కాని అద్భుతాలు ఆవిష్కృతమౌతాయి. అలాంటి అద్భుతమే నేపాల్ జళ ప్రళయంలో జరిగింది.    నేపాల్ దేశంలో సంభవించిన భారీ వరదలు, పెను విధ్వంసం మధ్య ఆహారం, నీరు లేకుండా ఏకంగా తొమ్మిది రోజులు శిథిలాల కింద ఇరుక్కుని ఇద్దరు ప్రాణాలతో బయటపడిన సంఘటన అందరినీ విస్మయ పరిచింది.  

నేపాల్‌లో ఇటీవల సంభవించిన వరదలు, కొండచర్యలు విరిగిపడిన ఘటనల్లో పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించిన సంగతి తెలిసిందే.   ఈ విలయంలో పలువురు గల్లంతయ్యారు. అలా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలలో   జలవిద్యుత్ కేంద్రం సమీపంలో సొరంగం లోపలి నుంచి  కేకలు వినిపించాయి.  అప్రమత్తమైన సిబ్బంది అక్కడ భయానక వాతావరణంలో శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు కార్మికులు సజీవంగా కనిపించారు.  ఆహారం, తాగునీరు కూడా  లేకుండా వారు తొమ్మిది రోజుల పాటు సజీవంగా ఉండటం నిజంగా అద్భుతమని అధికారులు అంటున్నారు.  ప్రాణాలను కాపాడుకోవాలన్న వారి పట్టుదల, సంకల్పం ముందు మృత్యువు తలవొంచిందని చెప్పాలి.  


సొరంగం లోపల చిక్కుకున్న ఆ ఇద్దరు కార్మికులను రెస్క్యూ సిబ్బంది ఎంతో జాగ్రత్తగా బయటకు తీసుకువచ్చారు. తొమ్మిది రోజులుగా ఆకలిదప్పులతో అలమటించిపోయిన వారిని   మెరుగైన చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి ప్రత్యేక పర్యవేక్షణలో వారు చికిత్పస పొందుతున్నారు.  


[Nepal floods, survived under rubble, Nepal rescue operation, Trishuli hydel project, viral news, disaster survival]