TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నేపాల్‌ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు..?

Published on: Thu Aug 27, 2026 10:31AM

 

నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు తెలుగు రాష్ట్రాలకు చెందిన యాత్రికుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయి. హైదరాబాద్‌లోని  ఓ ప్రైవేటు ట్రావెల్‌ ఏజెన్సీ ద్వారా కైలాస మానసరోవర్‌, నేపాల్‌ విహారయాత్రకు వెళ్లిన 156 మంది తెలుగు యాత్రికుల్లో 140 మంది ఆచూకీపై ప్రస్తుతం స్పష్టత లేకపోవ డం ఉత్కంఠకు దారితీ సింది. మొత్తం 156 మంది యాత్రికులు హైదరాబాద్ నుండి నేపాల్‌ పర్యటనకు వెళ్లారు. వీరిలో 16 మంది అనారోగ్యం కారణంగా తాము బస చేసిన గదుల్లోనే ఉండిపోయారు. 

మిగిలిన 140 మంది యాత్రలో భాగంగా బయ టకు వెళ్లిన సమయంలో నేపాల్‌–టిబెట్‌ సరిహద్దు పరివాహక ప్రాంతంలో ఆకస్మికంగా భారీ వరదలు సంభవించాయి.నేపాల్‌–టిబెట్‌ సరిహద్దు ప్రాంతం లోని భోటెకోషి, త్రిశూలి నదుల్లో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది.భారీగా వచ్చిన వరదల కారణంగా పలు రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడ టంతో పాటు కమ్యూనికే షన్‌ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. 

దీంతో బయటకు వెళ్లిన 140 మంది యాత్రి కులతో సంబంధాలు తెగిపోయాయి. వారి  మొబైల్‌ ఫోన్లకు కుటుంబ సభ్యులు, నిర్వాహకులు సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ సమా చారం అందకపోవడంతో ఆందోళన మరింత పెరిగింది. అనారోగ్యం కారణంగా గదుల్లోనే ఉండిపోయిన 16 మంది యాత్రి కులు ప్రస్తుతం సురక్షిత ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందింది. అయితే పర్యటన కోసం బయటకు వెళ్లిన 140 మంది యాత్రికులు ఎక్కడ ఉన్నారు? అనే దానిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

యాత్రి కుల ఆచూకీ కోసం భారత రాయబార కార్యాలయం (ఇండియన్‌ ఎంబసీ), నేపాల్‌ భద్రతా బలగాలు రంగంలోకి దిగి హెలికాప్టర్ల ద్వారా వరద ప్రభావిత ప్రాంతాల్లో గాలింపు, సహా యక చర్యలు చేపడుతు న్నారు. వరదలోచిక్కుకుపో యిన వారిని గుర్తించి సుర క్షిత ప్రాంతాలకుతరలించేం దుకు ప్రయత్నాలు కొన సాగుతున్నాయి. యాత్రి కుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని, అధికారుల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచనలు అందుతున్నాయి. 

అత్య వసర సహాయం కోసం నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం/సంబంధిత హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని అధికా రులు సూచిస్తున్నారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు ఢిల్లీ తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్ సెంటర్‌ ఏర్పాటు చేశారు.హెల్ప్‌లైన్‌ నెంబర్లు 9871999044, 9949351270 హెల్ప్‌లైన్‌ నెంబర్ 9618597969 లకు సంప్రదించవచ్చునని అధికారులు వెల్లడించారు. గల్లంతైన140మంది కుటుంబ సభ్యులు వారు సురక్షితంగా ఉన్నారనే వార్త వినడం  కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు...

 

Nepal Floods, Nepal Tibet Border Flash Flood, Nepal Army Rescue Operations, Telugu pilgrims, Hyderabad Pilgrims, Kailash Mansarovar Yatra,  Stranded Indian Tourists, Telugu news, Telugu one