నేపాల్ లో జల ప్రళయం.. వెయ్యి మంది గల్లంతు.!
Published on: Wed Aug 26, 2026 3:54PM

నేపాల్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. టిబెట్ సరిహద్దుకు సమీపంలోని రసువా జిల్లాలో మెరుపు వరదలకు ఓ గ్రామం మొత్తం కొట్టుకుపోయింది. దాదాపు వెయ్యి మందికి పైగా గల్లంతయ్యారు. బుధవారం సంభవించిన ఈ వరద ఉద్ధృతి కారణంగా సంభవించిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. పర్వత ప్రాంతమైన ఈ ప్రాంతంలో ప్రవహించే భోటె కోషి నదిలో నీటి ప్రవాహం భారీగా పెరగడంతో దిగువ ప్రాంతాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.
గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. త్రిషూలి నదీ పరివాహక ప్రాంతంతో పాటు నువాకోట్, ధాడింగ్, చిత్వాన్, గోర్ఖా జిల్లాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని నేపాల్ ప్రభుత్వం హెచ్చరించింది. ఆయా జిల్లాల ప్రజలు ఎగువ ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది.
Nepal Floods, Rasuwa District Flash Floods, Bhotekoshi River, Nepal Natural Calamity, Over1000missing


