మానస సరోవరంలో 31 మంది హైదరాబాద్ యాత్రికులు సురక్షితం..!
Published on: Thu Aug 27, 2026 12:43PM

నేపాల్‌లో అకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా ఎంతోమంది ఆ వరదల్లో గల్లంతయ్యారు. హైదరాబాద్ నుండి 156 మంది నేపాల్ పర్యటన కోసం వెళ్లారు. అందులో 140 మంది నేపాల్ అందాలు చూసేందుకు వెళ్లారు. మిగిలిన 16 మంది వారు బస చేసిన గదిలోని విశ్రాంతి తీసుకుంటున్నా రు. అయితే నేపాల్ లో ఒక్కసారిగా వచ్చిన వరద కారణంగా చాలామంది ఆ వరదలో గల్లంతయ్యారు. అప్పటినుండి హైదరాబాదు నుండి వెళ్లిన యాత్రికులు ఆచూకీ లభ్యం కాలేదు. అయితే అందులో 31 మంది సురక్షితంగా ఉన్నామంటూ ఫోటోలు ,వీడియోలు విడుదల చేశారు. దీంతో అధికారులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. నేపాల్ మీదుగా కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన 31 మంది యాత్రికులు మానస సరోవర్ వద్ద సురక్షితంగా ఉన్నట్లు సమాచారం ఇచ్చారు.
నిన్న ఉదయం నేపాల్– టిబెట్ సరిహద్దు ప్రాంతంలో భారీ వరదలు సంభవించినప్పటికీ, అంతకుముందే వరద ప్రభావిత ప్రాంతాన్ని దాటి మానస సరోవర్ ప్రాంతానికి చేరుకున్నట్లు తెలిపారు.ప్రస్తుతం యాత్రికులు మానస సరోవర్ వద్ద సురక్షితంగా ఉన్నామని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఇప్పటివరకు ఆందోళనలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు కొంత ఊరట లభించింది. అయితే భారత్‌కు తిరిగి రావడమే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. టిబెట్ మీదుగా చైనాలోకి ప్రవేశించి, అక్కడి నుంచి భారత్‌కు చేరుకోవాలని యాత్రికులు భావిస్తు న్నారు.
ఇందుకోసం చైనా సరిహద్దు మార్గం తెరవాల్సి ఉంది. సరిహద్దు పరిస్థితులు, రహదారుల పరిస్థితిపై స్పష్టత వచ్చిన తర్వాతే వారి తిరుగు ప్రయాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతంలో బుధవారం సంభవించిన భారీ వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. భోటేకోశి నది పరివాహక ప్రాంతంలో రహదారులు, మౌలిక వసతులు దెబ్బతినడంతో కైలాస్ మానస సరోవర్ యాత్రికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వందలాది మంది యాత్రికులతో సంబంధాలు తెగిపోయి నట్లు అధికారులు, పర్యాటక సంస్థలు వెల్లడించాయి.
Nepal Floods, Telugu pilgrims, Hyderabad Pilgrims, Kailash Mansarovar Yatra, Stranded Indian Tourists, Telugu news, Telugu one, Manasarovar, Tibet, Chinna


