TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మనం సాధించగలం: 2047 వికసిత్ భారత్ సాకారం దిశగా ఐదు లక్ష్యాలు.!

Published on: Wed Oct 7, 2026 2:57PM

ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు  మనం సాధించగలం అంటూ స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు.  ప్రభుత్వాధినేతగా  పాతికేళ్ల ప్రస్థానం పూర్తి అయిన సందర్భంగా  బుధవారం (అక్టోబర్ 7) ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని మోడీ. 2047 నాటికి వికసిత భారత్‌ సాధించగలం అన్న నినాదంతో జనంలో ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం ఆయన ఐదు లక్ష్యాలను ప్రకటించారు.  2001 అక్టోబర్ 7న నరేంద్ర మోదీ తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రభుత్వాధినేతగా ఆయన ప్రస్థానం పాతికేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని కేవలం తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసుకునే కార్యక్రమంగా కాకుండా.. దేశ భవిష్యత్తుపై కొత్త సంకల్పం తీసుకునే సందర్భంగా ప్రధాని మోడీ అభివర్ణించారు. గతాన్నిగుర్తు చేసుకుంటూనే భవిష్యత్ లక్ష్యాలపై జనానికి దిశా నిర్దేశం చేశారు. 

2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యం సాధించాలంటే.. అందుకు అనుసంధానంగా ఐదు లక్ష్యాలను అధిగమించాలని పిలుపు నిచ్చారు. వాటిలో మొదటిది.. వరల్డ్ టాప్ 3 ఎకానమీలలో భారత్  ఒకటిగా నిలవాలి. రెండు.. ఆత్మనిర్భర్ భారత్.. కీలక రంగాలలో స్వయం సమృద్ధి సాధించాలి. మూడు గ్లోబల్  మాన్యుఫాక్చరింగ్ హబ్ గా ఇండియా ఎదగాలి. నాలుగు ఒలిపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వాలి. అలాగే ఐదవది అంతరిక్షంలో మానవ సహిత యాత్ర విజయవంతంగా పూర్తి చేయలి. ఈ ఐదు లక్ష్యాలనూ సాధిస్తే మనం సాధించగలం. ఔను ఇండియాకు అసాధ్యమైనదేదీ ఉండదని మోడీ ఉద్వేగపూరితంగా పిలుపునిచ్చారు.  పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పుడే దేశ సామర్థ్యం మరింత పెరుగుతుందన్నారు. 

గతంతో పోలిస్తే భారత్ ప్రస్తుతం సంక్షోభాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుకుందన్న ప్రధాని మోడీ,  గతంలో సంక్షోభాలు వచ్చినప్పుడు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడేదని, ప్రస్తుతం భారత్ చూపుతున్న స్థిరత్వం, ప్రతిఘటనా సామర్థ్యం కారణంగా సంక్షోభంలోనూ ఆర్థిక వ్యవస్థ చెక్కు చెదరకుండా స్థిరంగా ఉందనీ, దీనిపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని అన్నారు.గతంలొ దుశంలొ పాలసీ పారాలిసిస్’ గురించి చర్చ జరిగేదని, ఇప్పుడు సంస్కరణల వేగం గురించి చర్చ జరుగుతోందనీ చెప్పారు.  

  ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని మోదీ చేసిన ప్రసంగం గత విజయాల కంటే భవిష్యత్ లక్ష్యాల చుట్టూనే సాగింది. మనం సాధించగలం అనే నినాదంతో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రస్తావిస్తూ.. 2047 వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు భారీ సంకల్పాలను ముందుకు తెచ్చారు. 


[Narendra Modi New Slogun, We Will Do It, Viksit Bharat, Modi Five Goals, Atmanirbhar Bharat, Global Manufacturing Hub, Olympics, India space mission, Telugu One]