TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ కేంద్రంగా స్వర్ణ దశాబ్ధం: ల్యాండ్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఆంధ్రప్రదేశ్.. పాన్ ఐఐటీలో నారా లోకేష్.!

Published on: Mon Oct 5, 2026 11:08AM

దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి కేవలం ఒక్క దశాబ్దానికి మాత్రమే ఉందని, ఆ స్వర్ణ దశాబ్దికి ఏపీ కేంద్ర బిందువని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు.  బెజవాడ వేదికగా జరిగిన పాన్ ఐఐటీ సమిట్-2026లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన ఆయన రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేసేందుకు తాము అనుసరిస్తున్న విధానాలు, భవిష్యత్ ప్రణాళికలను  వివరించారు.   

పాలనలో వేగం, సేవాభావం, స్థిరత్వం అనే మూడు ప్రధాన సూత్రాలను  ప్రాతిపదికగా తీసుకుని ఏపీ సర్కార్ ముందుకు సాగుతోందన్నారు.  ప్రజలు తమకు ఐదేళ్ల సుదీర్ఘ సమయం ఇచ్చారన్న లోకేష్.. అయినా ఏడాది కా ఏడాది   తాము సాధించిన ప్రగతిని ప్రజల ముందు ఉంచాలనేదే తమ ప్రభుత్వ తపన అన్నారు. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, గ్రౌండ్ లెవల్‌లో వాస్తవ రూపం దాల్చే ప్రాజెక్టుల ద్వారా యువతకు   ఉపాధి అవకాశాలను సృష్టించడమే  లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలను, వ్యాపార దిగ్గజాలను దేశ నిర్మాణంలో కీలక భాగస్వాములుగా భావిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐదు లక్షల మంది ఐఐటీ గ్రాడ్యుయేట్లతో నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుని, వారి సహకారాన్ని రాష్ట్ర అభివృద్ధికి వినియోగించుకుంటున్నామని చెప్పారు.

 గతంలో  స్పీడ్ విధానంతో ప్రయాణం ప్రారంభించి, క్రమంగా  జాగ్‌ నుండి  ఇన్‌స్టిట్యూషన్  స్థాయికి ఎదిగామని, ఇప్పుడు ఏపీని ఒక  ల్యాండ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్  గా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని ఆయన వివరించారు.   అమరావతి  దేశం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తోందనీ,  అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలిస్తే భారత్ ఏదైనా సాధించగలదనే నమ్మకం కలుగుతుందని అన్నారు. కేవలం 100 రోజుల్లోనే అమరావతిలో వేగంగా మార్పులు వస్తున్నాయని, భవిష్యత్తులో 5 వేల ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయి గ్రీన్‌‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించనున్నట్లు వెల్లడించారు. 

ఈ విమానాశ్రయం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఒక ప్రధాన చోదక శక్తిగా మారుతుందన్నారు.   ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లిన ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ను కేవలం 17 నెలల వ్యవధిలోనే  రాష్ట్రానికి రప్పించగలిగామనీ,  విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించామనీ,   ఒకప్పుడు ఎవరికీ పెద్దగా తెలియని ప్రాంతాలు ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌లుగా మారుతున్నాయనీ లోకేష్ చెప్పారు.

 సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన  సీఎం చంద్రబాబు 4.0' ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు యువ హార్డ్‌వర్క్ టీమ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తోందని తెలిపారు.   ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ, చిన్న లోపాలను కూడా సరిదిద్దుకునేలా వ్యవస్థను తీర్చిదిద్దామని మంత్రి వెల్లడించారు. రాజకీయ మార్పులతో పాటు పాలనలో శాశ్వత స్థిరత్వాన్ని తెచ్చే వినూత్న విధానాలను అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.  

[Nara Lokesh Pan IIT Summit, Andhra Pradesh Development, Amaravati Greenfiled Airport, AP Industrial Progress, Golden Decade]