బెజవాడలో 72 అడుగుల మట్టి గణపతి: దర్శించుకుని నిర్వాహకులను అభినందించిన మంత్రి లోకేష్.!
Published on: Thu Sep 24, 2026 1:49PM

బెజవాడ భవానీపురంలో వినాయక నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ఇస్తూ రూపొందించిన 72 అడుగుల పంచముఖ వరసిద్ధి మహా గణపతి మట్టి వినాయకుడిని రాష్ట్ర మంత్రి నారాలోకేష్ బుధవారం (సెప్టెంబర్ 23) దర్శించుకున్నారు.
ఇందు కోసం భవానీపురం చేరుకున్న మంత్రి లోకేష్‌కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన పర్యావరణ హితంగా రూపుదిద్దుకున్న 72 అడుగుల మహా మట్టి గణపతిని దర్శించుకుని లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పర్యావరణాన్ని రక్షించేలా మట్టి విగ్రహాలను పూజించడంపై ఆయన నిర్వాహకులనుఅభినందించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.
పూజా కార్యక్రమాల అనంతరం మంత్రి సమితి సభ్యులతో కలిసి ముచ్చటించి, నిర్వాహకుల బృందంతో కలిసి ఫోటోలు దిగారు. ఈ భారీ గణపతి విగ్రహ రూపకల్పన వెనుక ఉన్న శిల్పుల ప్రతిభను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
[Nara Lokesh, Vijayawada Bhavanipuram, Doondi Ganapathi celebrations, 72 foot clay Ganesha, Vinayaka Navaratri, Telugu One]


