టీచర్లపై వైసీపీ గుండాల దాడి.. క్రిమినల్ గ్యాంగులను వదిలే ప్రసక్తే లేదు : మంత్రి లోకేశ్
Published on: Mon Sep 21, 2026 6:30PM
.webp)
విజయవాడలో స్పోర్ట్స్ కోటా డీఎస్సీ-2025 టీచర్లపై దాడి జరిగిందంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. వైసీపీకి చెందిన వ్యక్తులే టీచర్లపై దాడికి దిగారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేసిన లోకేశ్.. క్రీడల్లో ప్రతిభ చూపించి దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకొచ్చిన క్రీడాకారులకు అన్యాయం చేయడం సరికాదన్నారు.
స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయంటూ ఫేక్ ఆరోపణలు చేసినప్పుడే జగన్ వైఖరి బయటపడిందని లోకేశ్ విమర్శించారు. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి స్పోర్ట్స్ కోటాలో టీచర్ ఉద్యోగాలు సాధించిన వారిని తప్పుడు ఆరోపణలతో అవమానిస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ స్పోర్ట్స్ కోటా డీఎస్సీ-2025 టీచర్లు విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద అధికారులను కలిశారని తెలిపారు. ఈ సందర్భంగా కొందరు వైసీపీ మద్దతుదారులు టీచర్లపై దాడికి పాల్పడ్డారని లోకేశ్ ఆరోపించారు.
.webp)
రౌడీ షీటర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లను టీచర్లపైకి ఉసిగొల్పారని ఆయన ఆరోపించారు. గురువులను గౌరవించాల్సిన స్థానంలో వారిపై రాడ్లు, కర్రలతో దాడి చేయడం దారుణమన్నారు. టీచర్లపై దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని లోకేశ్ స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల విషయంలో వైసీపీ జోక్యం చేసుకోవడం మానుకోవాలని సూచించారు.
[ Nara Lokesh, Sports Quota DSC 2025, DSC Teachers, Sports Quota Teachers, Vijayawada, AP Education Minister, YSRCP, TDP, SHAP Office, Teachers Attack, AP Politics, Sports Quota Recruitment, Andhra Pradesh Teachers, Lokesh Warning, Teacher Protest, AP Education Department, Sports Quota Controversy, Vijayawada Protest ]


