TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడిన వారిని ఉపేక్షించం.. లోకేష్ హెచ్చరిక.!

Published on: Mon Sep 21, 2026 5:30PM

బోధనారంగాన్ని గౌరవించాల్సిన సమాజంలో గురువులపై దాడులకు పాల్పడితే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ హెచ్చరించారు. విజయవాడలో జరిగిన టీచర్లపై దాడి ఘటనపై  ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. సమాజానికి విజ్ఞానాన్ని పంచే దైవసమానులైన ఉపాధ్యాయులపై భౌతిక దాడికి దిగడం   హేయమన్నారు.  


విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కార్యాలయం వద్ద డీఎస్సీ-2025 స్పోర్ట్స్‌ కోటా ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారులను కలిసేందుకు వెళ్లారు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న కొందరు   ఉపాధ్యాయులపైకి దూసుకొచ్చి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై స్పందించిన మంత్రి లోకేశ్‌, ఈ దుశ్చర్య వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయన్నారు.

రాష్ట్రంలో క్రీడా రంగంలో ప్రతిభ చాటుకుని, స్వయంశక్తితో ఉద్యోగాలు దక్కించుకున్న వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం దారుణమని పేర్కొన్న లోకేష్.. ఈ దాడి ఘటనలో  రౌడీ షీటర్లు, గంజాయి ముఠాలు, బ్లేడ్ బ్యాచ్‌లకు చెందిన వ్యక్తులను ఉద్దేశపూర్వకంగానే ఉపాధ్యాయులపైకి ఉసిగొల్పారని ఆరోపించారు.  ప్రభుత్వ విద్యా సంస్థలను, ఉపాధ్యాయ వర్గాలను టార్గెట్ చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్న ఆక్ష్న  దాడులు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని, అందరిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.  


[Nara Lokesh, AP Education Minister, DSC 2025 Teachers Attack, Vijayawada SAAP Office, YSRCP rowdy sheeters, Warning, Telugu One]