Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...లోకేష్ అన్న అండ ఉండగా... భయం లేదిక ...పునర్విక
posted on: Feb 25, 2026 9:05PM
.webp)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు వెంటనే గుర్తొచ్చే పేరు నారా లోకేష్. ఆ పేరు ఒక అభయం, అభయం లభిస్తే ఏ భయం ఉండదు. గత కొన్ని రోజులుగా చిన్నారి పునర్విక ఆరోగ్యం కోసం సోషల్ మీడియాలో లక్షలాది మంది ఒక మానవతా సైన్యంగా ఏర్పడి నిధులు సమకూరుస్తున్నారు. పోస్టుల ద్వారా పునర్విక కుటుంబానికి నైతిక మద్దతు తెలుపుతున్నారు. SMA టైప్-1 అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న కర్నూలుకు చెందిన పునర్విక ఎంతో ధైర్యంగా ఈ వ్యాధితో పోరాడుతోంది.
చిన్నారిని రక్షించుకునేందుకు ఉన్న ఏకైక మార్గం ₹16 కోట్లు ఇంజక్షన్. స్పందించిన ప్రతిహృదయం ₹10 కోట్లు విరాళాలు సేకరించింది. ఇంకా కావాల్సిన ₹6 కోట్లు మంత్రి నారా లోకేష్ సమకూరుస్తామని ప్రకటించారు. పునర్విక పాప ఆరోగ్యం కోసం విరాళాలు ఇచ్చినవారు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసినవారు, ప్రార్థించిన వారందరికీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు. పునర్విక తల్లిదండ్రులకు తనవంతు సహాయం ₹6 కోట్లు అందజేసి, చిన్నారి పరిపూర్ణ ఆరోగ్యవంతురాలు అయ్యేందుకు జరిగే చికిత్సకు సహకరించే చర్యలు తీసుకోవాలని తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.






