దిగ్గజ నటుడు నానా పటేకర్ ఇక లేరు: గుండెపోటుతో కన్నుమూత.!
Published on: Thu Oct 8, 2026 9:29AM

బాలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు నానా పటేకర్ ఇక లేరు. గురువారం (అక్టోబర్ం 8) తెల్లవారుజామున గోవాలోని తన నివాసంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది.
నానా పటేకర్‌కు ఛాతీలో తీవ్ర నొప్పి రావడంతో వైద్య బృందాన్ని తొలుత ఆయన నివాసానికి పిలిపించిచారు. అక్కడ నానాపటేకర్ అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన వైద్య బృందం, ప్రాథమిక చికిత్స అనంతరం మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు దాదాపు 45 నిమిషాల పాటు నిరంతరంగా సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
నానా పటేకర్ అసలు పేరు విశ్వనాథ్ పటేకర్ 1978లో గమన్ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. తన విలక్షణ నటన, గంభీరమైన డైలాగ్ డెలివరీ, బలమైన పాత్రలతో హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమల్లో నానా పటేకర్ గుర్తింపు తెచ్చుకున్నారు. పరిందా, ‘క్రాంతివీర్’, ‘అబ్ తక్ ఛప్పన్ , ‘అపహరణ్’, నటసమ్రాట్, వెల్‌కమ్ వంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో చిరస్మరణీయంగా నిలిచాయి.
నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ నానా పటేకర్ తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన కెరీర్‌లో మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు సహా పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు. కళారంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2013లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది.

నానా పటేకర్ మృతితో భారత సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. దశాబ్దాల పాటు తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించిన ఈ దిగ్గజ నటుడి మరణ వార్త అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
[Nana Patekar, Nana PatekarNomore, , Bollywood Actor, Nana Patekar Goa,Padmasri Awardee,Indian Film Industry, Telugu One]


