TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గజరాజుల సంరక్షణకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలి : నాగబాబు

Published on: Sun Sep 13, 2026 6:30PM

అడవుల సంరక్షణతో పాటు వన్యప్రాణుల పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నాగబాబు పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలోని గుచ్చిమి ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని ఆదివారం నాగబాబు సందర్శించారు. పర్యటనలో భాగంగా గుచ్చిమి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో రావి, వేప మొక్కలను నాటారు. అటవీ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్రతి ప్రదేశంలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టాలని అధికారులకు సూచించారు. పచ్చదనం పెంపుతోపాటు అటవీ పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. 

అనంతరం ఏనుగుల సంరక్షణ కేంద్రంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను నాగబాబు సమీక్షించారు. అడవి ఏనుగుల సంచా రం, వాటి కదలికలను క్షేత్రస్థాయిలో ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారనే విషయాలను ఏనుగుల ట్రాకర్లను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వన్యప్రాణులు– మానవుల మధ్య ఘర్షణలను తగ్గించేందుకు అటవీ శాఖ చేపడుతున్న ముందస్తు చర్యలను పార్వతీపురం డీఎఫ్‌ఓ ఎస్. వెంకటేష్, ఎఫ్‌ఆర్‌ఓ తదితర అధికారులు మ్యాప్ సహాయంతో నాగబాబుకు వివరించారు. ఏనుగులు సంచరించే అటవీ ప్రాంతాల్లో నెలకొన్న కఠినమైన భౌగోళిక పరిస్థితులు, వాటి కదలికలను పర్యవేక్షించ డంలో ఎదురవుతున్న ఇబ్బందులు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అధికారులు వివరించారు. ఏనుగుల సంరక్షణతో పాటు సమీప ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటవీ శాఖ అధికారులు, సిబ్బంది చేస్తున్న క్షేత్ర స్థాయి కృషిని నాగబాబు అభినందించారు. 

మానవ–వన్యప్రాణి ఘర్షణలను మరింత సమర్థవంతంగా నివారిం చేందుకు పటిష్టమైన చర్యలు కొనసాగించాలని సూచించారు.అనంతరం గుచ్చిమి సంరక్షణ కేంద్రంలోని జయంత్, అభిమన్యు అనే రెండు కుంకీ ఏనుగులను నాగబాబు పరిశీలించారు. వాటి మావటిలతోపాటు పశు వైద్యుడిని కలిసి ఏనుగుల ఆరోగ్య పరిస్థితి, సంరక్షణ, ఆహార విధానం తదితర అంశాలపై వివరాలు అడిగి తెలు సుకున్నారు.అనంతరం నాగబాబు జయంత్, అభిమన్యు ఏనుగులకు రాగి, స్వీట్ కార్న్, చెరకు, బెల్లం వంటి ఆహారాన్ని స్వయంగా తినిపించారు. ఏనుగుల సంరక్షణ కేంద్రంలో వాటికి అందుతున్న వసతులు, ఆరోగ్య పరిరక్షణ చర్య లను పరిశీలించారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు, వన్యప్రాణుల సంరక్షణ,మానవ–వన్యప్రాణి ఘర్షణల నివారణకు సమన్వయంతో పనిచే యాల్సిన అవసరాన్ని నాగబాబు అధికారులకు సూచించారు.

 

 

 

[ Nagababu, Chairman of the Green Executive Committee, Gajaraju, Manyam District, Sitanagaram, AP Forest Department, Elephant care, Janasena party, Pavan kalyan,  Telugu One, Telugu News ]