TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మైదుకూరు మునిసిపల్ ఎన్నికలు వాయిదా: త్వరలో మళ్లీ నోటిఫికేషన్.!

Published on: Mon Oct 19, 2026 12:49PM

కడప జిల్లాలోని మైదుకూరు మున్సిపాలిటీకి జరగాల్సిన ఎన్నికలను వాయిదా పడ్డాయి.  ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా విజయవాడలో సోమవారం (అక్టోబర్ 19) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించారు.   మైదుకూరు మున్సిపాలిటీకి త్వరలోనే మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని తెలిపారు.

మైదుకూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్‌ పత్రాలను చించివేయడంతో వాటి పరిశీలన కష్టంగా మారిందన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్.. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మున్సిపాలిటీకి తిరిగి నోటిఫికేషన్‌ విడుదల చేసి ఎన్నికల ప్రక్రియను చేపడతామని స్పష్టం చేశారు. 

అదలా ఉంటే.. ఇదే మీడియా సమావేశంలో రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.  స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను ఎన్నికల కమిషన్‌ చేపడుతుందని తెలిపారు. మైదుకూరు మున్సిపల్‌ ఎన్నికల వాయిదాతో అక్కడి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కొత్త నోటిఫికేషన్‌ వెలువడాల్సి ఉంది.


[Mydukur Municipal Elections Postpone, State Election Commission, AP Local Body Elections, YSR Kadapa District, SEC, Telugu One]