TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నీరసం, రక్తహీనత తగ్గాలంటే, మటన్ బోటి కూర ఎందుకు తినాలి?

Published on: Thu Oct 15, 2026 10:54AM

నాన్‌వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే వంటకాల్లో మటన్ బోటి కూర కచ్చితంగా ఉంటుంది. సాధారణంగా చికెన్, మటన్‌ను ఇష్టపడేవారు మేకలోని ప్రతి భాగాన్ని రుచిగా వండుకుంటారు. అయితే మేక లేదా గొర్రె పేగులతో తయారయ్యే బోటిని క్రమం తప్పకుండా లేదా వారానికి, పదిరోజులకు ఒకసారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరం బలంగా, దృఢంగా మారుతుందని డైటీషియన్లు, నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మేక కేవలం పచ్చని ఆకులను మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది కాబట్టి, దాని పేగులలో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు సమృద్ధిగా దాగుంటాయి. బోటిలో అధికంగా లభించే ప్రోటీన్, ఫ్యాట్స్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఎప్పుడూ అలసటగా, నీరసంగా లేదా బలహీనంగా అనిపించేవారికి బోటి కూర ఒక అద్భుతమైన వరం లాంటిదడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ పోషకభరితమైన వంటకంలో శరీరానికి అవసరమైన ఐరన్, ఫైబర్‌తో పాటు విటమిన్ బి12, విటమిన్ ఎ, ఇ, మరియు కె వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. జిమ్‌కు వెళ్లి కఠినమైన వర్కౌట్స్ చేసేవారికి మరియు కండరాల బలం పెంచుకోవాలనుకునేవారికి బోటి ఒక ఉత్తమమైన ఆహార ఎంపిక. ఇందులో ఉండే జింక్ చర్మం కాంతివంతంగా ప్రకాశించడానికి, జుట్టు దృఢంగా పెరగడానికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే, విటమిన్ బి12 జ్ఞాపకశక్తిని (మెమరీ పవర్) మెరుగుపరిచి, మెదడును ఎప్పుడూ చురుకుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలోని ప్రతి కణానికి, ముఖ్యంగా నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహకరించి నరాల బలహీనతను సమర్థవంతంగా నివారిస్తుంది.

అంతేకాకుండా, బోటిలో లభించే ఐరన్ రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది రక్తహీనతతో బాధపడేవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. బోటి కూరలో ఉండే ప్రోబయోటిక్స్ మన గట్ హెల్త్‌కి, జీర్ణవ్యవస్థ పనితీరుకు చాలా మేలు చేస్తాయి. అలాగే సన్నగా బలహీనంగా ఉండేవారు త్వరగా బరువు పెరగడానికి ఇది ఒక బెస్ట్ ఫుడ్ అని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, మార్కెట్లో తక్కువ ధరకే దొరుకుతుందని దీనిని అధికంగా లేదా పరిమితికి మించి తింటే శరీరంలో కొలెస్ట్రాల్ గణనీయంగా పెరిగి గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి, గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు (బీపీ) సమస్య ఉన్నవాళ్లు బోటి కూరను అస్సలు తినకూడదని హెచ్చరిస్తున్నారు. వండేటప్పుడు వేడి నీటితో నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి, సరిగ్గా ఉడికించి మితంగా తీసుకుంటేనే బోటి ద్వారా సంపూర్ణ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

 

 

mutton boti health benefits, goat intestine nutrition, boti benefits, benefits of eating mutton boti, goat tripe health benefits, non veg health benefits, mutton boti curry nutrition.