వివేకా హత్యకేసు నిందితుడు పోలీసులకు ఫిర్యాదు...చంపాలని చూస్తున్నారు

 

కడప ఎంపీ అవినాష్ రెడ్డి మనుషులు తనను వెంబడించారని వివేకా హత్య కేసులోని ఎం -2 నిందితుడు సునీల్ యాదవ్ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ  ఫిర్యాదు మేరకు  సునీల్ యాదవ్ పెళ్లి రోజు కావడంతో క్రిష్ణుడి గుడికి వెళ్లి  అక్కడి నుంచి తన వాహనంలో ఇంటికి వస్తున్న సమయంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులైన లోకేశ్వర్ రెడ్డి, పవన్ కుమార్ (వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ )లతోపాటు మరో ఇరువురు వాహనంలో వెంబడించారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. తన వాహనం ముందు వెళ్తుంటే దాన్ని అనుసరిస్తూ మరో వాహనం వస్తూ ఉండడం గమనించానని తెలిపారు .ఈ వాహనంలో లోకేశ్వర్ రెడ్డి పవన్ కుమార్ ల ను గుర్తించినట్లు పోలీసులకు తెలిపారు. 

తనకు ప్రాణం ఉందని పులివెందుల అర్బన్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే హత్య సినిమాకు సంబంధించి కొన్ని వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది .ఆ సమయంలో పవన్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారించారు. గతంలో కూడా తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు సునీల్ యాదవ్ ఫిర్యాదు చేయడం జరిగింది. తాజాగా  జరిగిన సంఘటన నేపథ్యంలో మరో సారి తనకు ప్రాణహాని  ఉందని సునీల్ యాదవ్  ఫిర్యాదు చేశారు .ఈ ఫిర్యాదు పై పోలీసులు విచారణలో చేయనున్నట్లు సమాచారం.