TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కదులుతున్న కారు టాప్‌పై బీర్ తాగుతూ యువతి హల్‌చల్..ఎక్కడంటే.!

Published on: Sat Oct 17, 2026 4:47PM

నగర శివారు ప్రాంతాల్లో సోషల్ మీడియా రీల్స్  వైరల్ క్రేజ్ కోసం యువత చేస్తున్న ప్రమాదకర విన్యోసాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో లైకులు, వ్యూస్ కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని తుర్కయాంజల్ ప్రధాన రహదారిపై జరిగిన ఒక విపరీతమైన ఘటన స్థానికంగానే కాక రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కదులుతున్న కారు పైకప్పుపై ఎలాంటి భయం లేకుండా కూర్చొని, ఒక చేత్తో బీర్ బాటిల్ పట్టుకుని తాగుతూ ఓ యువతి చేసిన హల్‌చల్ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 

రద్దీగా ఉండే రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు టాప్‌పై ఈ విధంగా ప్రవర్తించడం చూసిన తోటి ప్రయాణికులు తీవ్ర విస్మయానికి గురయ్యారు.   సెలవులు లేదా సరదా పేరిట నడిరోడ్డుపై ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడటం వల్ల క్షణాల వ్యవధిలో ప్రాణాంతక ప్రమాపాలు జరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెనుక వస్తున్న ఒక వాహనదారుడు తన కారులోని డాష్‌క్యామ్‌లో రికార్డయిన ఈ షాకింగ్ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. క్షణాల్లో ఈ వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా చక్కర్లు కొట్టింది. 

రాత్రింబవళ్లు వాహనాలు రాకపోకలు సాగిస్తున్న బిజీ రోడ్డులో ట్రాఫిక్ నిబంధనలను బొత్తిగా గాలికి వదిలేసి, బాధ్యతారహితంగా వ్యవహరించిన తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు మీ సొంత ఆస్తులు కాదంటూ, ఇటువంటి వికృత చేష్టల వల్ల అమాయకుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయని మండిపడుతున్నారు.  ఈ తరహా ప్రమాదకర స్టంట్లు చేసే వారిపై రవాణా శాఖ అధికారులు  పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా భద్రతను పూర్తిగా గాలికి వదిలేసి, కేవలం క్షణికానందం కోసం యువత చేస్తున్న ఈ దుశ్చర్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 

రహదారులపై ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘిస్తూ, ఇలాంటి సాహసాలకు పాల్పడే వారిని కట్టడి చేసేందుకు నిఘా మరింత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ కోసం, క్షణికానందం కోసం చేసే ఇలాంటి పనుల వల్ల యువత తమ విలువైన ప్రాణాలను కోల్పోవడమే కాకుండా, రోడ్డుపై ప్రయాణించే ఇతర వాహనదారులకు కూడా తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు  స్థానికంగా వ్యక్తమవుతున్న వ్యతిరేకత సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది

 

 

 

[ moving car beer stunt, hyderabad viral video, turkayamjal news, reckless driving telangana, traffic violation hyderabad, dashcam video viral, CM Revanth reddy, Telangana Police, hyderabad police, CP Sajjanar, DGP C.V. Anand, Telugu One, Telugu news ]