TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మూడ్ ఆఫ్ ఏపీ.. తెలుగుదేశంకూటమి మళ్లీ క్లీన్ స్వీప్.!

Published on: Sat Aug 29, 2026 11:44AM

రాజకీయాల్లో మళ్లీ సర్వేల వేడి రాజుకుంది. మూడ్ ఆఫ్ నేషన్ పేరిట ఇటీవల ఇండియా టుడే సర్వే నిర్వహించింది. అందులో భాగంగా మూడ్ ఆప్ ఆంధ్రప్రదేశ్ సర్వే కూడా ఉంది. ఆ సర్వే ఫలితం వైసీపీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. ఎందుకంటే.. ఇటీవలే.. వైసీపీకి  అనుకూలంగా ఉన్న ఓ సర్వేను ఆ పార్టీ తన సోషల్ మీడియా వేదికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసింది. ఆ సర్వే ప్రకారం.. వచ్చే ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధిస్తుందనీ, జగన్ మళ్లీ సీఎం అవుతారనీ వైసీపీ చెప్పుకుని తన భుజాలను తానే చరుచుకుని సంబరాలు చేసుకుంది.

అయతే..  ఆ సర్వే కు స్పష్టమైన ఆధారాలు గానీ, విశ్వసనీయత గానీ లేవన్న అభిప్రాయం రాజకీయవర్గాలతో పాటు.. వైసీపీ శ్రేణుల్లో కూడా వ్యక్తమైంది. అది పక్కన పెడితే..    ఇండియా టుడే  సర్వే..   ఏపీలో  ప్రస్తుతం ఉన్న  రాజకీయ పరిస్థితులుకి, ప్రజల మనోభావాలకు అద్దం పట్టేలా ఉందంటున్నారు పరిశీలకులు. ఇంతకీ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ఆంధ్ర ఏం చెప్పిందంటే.. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికిప్రజాదరణ ఇసుమంతైనా తగ్గలేదనీ, ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే.. తెలుగుదేశం కూటమి మరో సారి ఘన విజయం సాధించి అధికారం చేపడుతుందనీ కుండబద్దలు కొట్టింది. అదే సమయంలో వైసీపీ గ్రాఫ్ గణనీయంగా పడిపోయిందని పేర్కొంది.  

ఆ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం పాతిక లోక్ సభ స్థానాలలో  తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.  రాష్ట్ర ప్రజలలో  తెలుగుదేశం కూటమి నాయకత్వంపై ఇసుమంతైనా నమ్మకం సడలలేదని సర్వేఫలితం పేర్కొంది.  తెలుగుదేశం కూటమి 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టి రెండేళ్లయినప్పటికీ.. ఆ ప్రభుత్వం పట్ల ప్రజలలో ఉన్న సానుకూలత చెక్కు చెదరలేదని ఇండియా టుడే.. సీవోటర్ సర్వే విస్పష్టంగా తేల్చి చెప్పింది.   

ఇక వైసీపీ విషయానికి వస్తే.. ఆ సర్వే మేరకు ఆ పార్టీ గ్రాఫ్ ఈ రెండేళ్లలో ఇసుమంతైనా పెరగలేదు సరికదా మరింత కిందకు దిగజారింది.  గత ఎన్నికల్లో 4 లోక్‌సభ స్థానాలకే పరిమితమైన వైసీపీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా అంతకు మించి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు లేవని పేర్కొంది.  

రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి పాలన పట్ల ప్రజలలో  పూర్తిస్థాయి విశ్వాసం కనిపిస్తోందన్నది సర్వే సారాంశంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, అమరావతి, పోలవరం పనులను పరుగులు పెట్టించడం, అలాగే..  వైసీపీ  హయాంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పునఃప్రారంభించి ముందుకు తీసుకెళ్లడం  ప్రజల్లో చంద్రబాబు సర్కార్ పట్ల సానుకూలతను పెంచిందని సర్వే ఫలితం చెబుతోంది. 

 

{Mood of AP. Andhra Pradesh Political Survey, India Today Mood of the Nation AP,  YCP MP Seats, Chandrababu  Governance}