TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నేషనల్ హీరో మోహిత్ ఉల్వా: ఇండియన్ క్రికెట్ కు మరో ఉజ్వల తార.!

Published on: Sun Nov 15, 2026 9:26AM

ఓ 18 ఏళ్ల కుర్రాడు. ఇంకా నూనూగు మీసాల వయస్సు వాడు. రాత్రికి రాత్రి నేషనల్ హీరో అయిపోయాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ నుంచి విజయాన్ని లాగేసుకుని దేశానికి కానుకగా ఇచ్చాడు. ఆ కుర్రోడి పేరు మోహిత్ ఉల్వా. క్రికెట్ లో దాదాపు అసాధ్యం అన్నదాన్ని తన అసమాన పోరాట పటిమతో సాధ్యం చేశాడు. అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ లో చివరి బంతికి బౌండరీ బాది జట్టుకు ఆసియాకప్ అందించాడు. ఈ విజయం, మోహిత్ ఉల్వా పోరాటం ఎందుకు ప్రత్యేకమంటే..ఇండియాలో క్రికెట్ ఒక మతం.  ఫార్మట్ ఏదైనా, ఆడే మ్యాచ్ స్థాయి ఏదైనా, పురుషుల జట్టు, మహిళల జట్టు, అండర్ 19 అన్న తేడా లేదు. అలాగే ఏ దేశంతో ఆడుతున్నా క్రికెట్ మ్యాచ్ అంటే చాలు దేశం మొత్తం ఒక ఎమోషన్ తో ఊగిపోతుంది. విజయం సాధిస్తే దేశమంతా సంబరాలు అంబరాన్నంటుతాయి. అదే మ్యాచ్ పాకిస్థాన్ తో అయితే ఇంక చెప్పేదేముంది.   తాజాగా అండర్ 19 ఫైనల్ మ్యాచ్ లో టీమ్ ఇండియా కుర్రోళ్లు అదరగొట్టారు. ఒటమి అంచుల నుంచి విజయనాదం చేశారు. అందులోనూ ఈ ఫైనల్ పాకిస్థాన్ తో ఇక చెప్పేదేముంది. దేశంలో సంబరాలు మిన్నంటాయి. 

ఇక ఈ మ్యాచ్ క్రికెట్ లో మ్యాజిక్ ను మరో సారి కళ్లకు కట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ టీమ్ ఇండియాకు కొండంత విజయ లక్ష్యన్ని నిర్దేశించింది. 338 పరుగుల విజయ లక్ష్యం మన బ్యాటర్లలో 8 వికెట్ల నష్టానికి 252 పరుగులతో టీమ్ ఇండియా అండర్ 19 జట్లు ఓటమి అంచుల్లో నిలిచింది. పరాజయం ఖాయమన్న నిరాశ ఇండియాను కమ్మేసింది. ఆ సమయంలో మనోళ్లు అనూహ్యంగా పుంజుకున్నారు. అనితర సాధ్యమైన పోరాట పటిమ చూపారు. చివరి బంతి వరకూ ఆటను తీసుకెళ్లారు. ఆఖరి బంతికి 3 పరుగులు అవసరం. ఆ సమయంలో స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరూ, అలాగే టీవీల ముందు కూర్చున్న కోట్లాది మంది మునివేళ్లపై నిలుచున్నారు. చేతి వేళ్ల గోళ్లు కొరికేసుకున్నారు. గుండె గొంతులోకి వచ్చింది. ఉత్కంఠ బీపీని పెంచేసింది. అయితే మైదానంలో ఆడుతున్న మన టైలెండర్లలో ఏ ఒత్తిడీ లేదు. చివరి బంతికి మూడు పరుగులు చేయాల్సి ఉండగా, ఆ చివరి బంతిని మన మోహిత్ ఉల్వా బౌండరీ దాటించాడు. భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 

 ఇక ఈ విజయంలో మన తెలుగు కుర్రోడు కీలక పాత్ర పోషించాడు. అతడి పేరు చిగురుపాట వెంకట నాగ విజయ సుభాష్. 18 ఏళ్ల ఈ కుర్రాడు, బౌలింగ్ లో విశ్వరూపం చూపి మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక బ్యాటింగ్ చివరి బ్యాటర్ గా బరిలోకి వచ్చిన సుభాష్ రెండు ఫోర్లు బాదాడు. మోహిత్ కు గట్టి మద్దతు ఇచ్చి, వికెట్ల ముందు పాతుకుపోయాడు.   ఈ విజయం టీమ్ ఇండియా క్రికెట్ సామర్థ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఇండియన్ క్రికెట్ రిజర్వ్ బలం ఏమిటో ప్రపంచానికి చాటింది. ఈ విజయం టీమ్ ఇండియా క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. 

అదలా ఉంటే.. ఒంటి చేత్తో జట్టుకు విజయాన్నందించిన మోహిత్ అల్వా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.   252 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఇక ఓటమి లాంఛనమే అనుకున్న స్థితి నుంచి జట్టుకు విజయాన్నందించాడు మోహిత్ అల్వా  మానల్ చౌహాన్‌తో కలిసి మోహిత్ ఉల్వా కీలక భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. చివరి వరకూ వికెట్ ను కాపాడుకుంటూనే, వేగంగా పరుగులు తీసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. టెన్నిస్ బాల్ క్రికెట్ నేపథ్యం నుంచి  జాతీయ జూనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మోహిత్ ఉల్వా వయస్సు 18 ఏళ్లు. చిన్నతనం నుంచీ కూడా క్రికెట్ అంటే ప్రాణం. కొడుకు ఇంట్రెస్ట్ ను గమనించిన తండ్రి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించారు. క్రికెట్ అకాడమీలో చేర్చాడు. అక్కడ శిక్షణలో రాటు దేలిన మోహిత్ అల్వా సౌరాష్ట్ర క్రికెట్ లో స్టార్ ప్లేయర్ గా ఎదిగాడు.

ఇది కూడా చదవండి: పాక్‌పై చివరి బంతికి భారత్ థ్రిల్లింగ్ విక్టరీ..కప్ మనదే.!

 జామ్ నగర్ క్రికెట్ అకాడమీలో మోహిత్ అల్వాకు మహేంద్ర సింగ్ చౌహాన్ కోచ్. ఈ మహేంద్ర సింగ్ చౌహాన్ ఎవరో కాదు.. టీమ్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు కోచింగ్ ఇచ్చిన వ్యక్తే. జడేజాలా మోహిత్ అల్వా కూడా తొలుత ఆఫ్ స్పిన్నర్ గానే శిక్షణ పొందాడు. అయితే అతనిలోని పేసర్ ను గుర్తించిన కోచ్, అతడిని పేస్ బౌలర్ గా తీర్చిదిద్దాడు.

దీంతో అతడి క్రికెట్ మారింది. ఉత్తర మీడియం పేసర్ గా గుర్తింపు వచ్చింది. అదే సమయంలో కోచ్ సలహాతో బ్యాటింగ్ నైపుణ్యాలనూ పెంచుకున్నాడు. అదే ఆసియాకప్ అండర్ 19 ఫైనల్ లో టీమ్ ఇండియాకు విజయాన్ని అందించింది. క్లిష్ట పరిస్థితుల్లో, ఓటమి అంచుల్లో ఉన్న జట్టును విజయతీరాలకు చేర్చే క్రమంలో ఒక బ్యాటర్ గా మోహిత్ ఉల్వా చూపిన పరిణితి.. అదే మెచ్యూరిటీ ఏ టాప్ క్లాస్ ప్లేయర్ కూ తీసిపోదని సెహ్వాగ్, గంగూలీ, లక్ష్మణ్ వంటి సీనియర్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. 

 మీకు నచ్చవచ్చు:  89 పరుగులకే ఆలౌట్.. బ్యాటర్లపై గంభీర్ ఫైర్!

టీమిండియా చెత్త రికార్డు.. 100 లోపే 9వ సారి ఆలౌట్!

[Mohit Ulva, India, TeamIndiaU19, Asia CupFina, LastballThriller, Coach, TeluguOne]