TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భారత జీవన విధానమే ప్రపంచానికి శ్రీరామ రక్ష.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉద్ఘాటన.!

Published on: Mon Aug 31, 2026 9:52AM

భారత జీవన విధానమే శ్రీరామరక్ష అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.  ఇండియన్స్  ఏ దేశంలో ఉన్నప్పటికీ  ఆయా దేశాలకు నమ్మకమైన, నిజాయతీ కలిగిన పౌరులుగా మెలగాలన్నారు. అదే సమయంలో ఇండియన్ కల్చర్,  సనాతన ధర్మానికి  ప్రతీకలైన ఐక్యత, సేవ అనే సందేశాన్ని ప్రచారం చేసి దానిని విశ్వవ్యాప్తం చేయాల్సిన బాధ్యత కూడా విదేశాలలో ఉన్న ప్రవాస భారతీయులపై ఉందని చెప్పారు. 

కెనడాలోని   టొరంటో  జరిగిన ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ దాదాపు  2 వేల మందికి పైగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రేమతో, స్నేహంతో ప్రపంచాన్ని హత్తుకోవడం అన్న అంశంతో జరిగిన ఈ సదస్సులో ఆర్ఎస్ఎస్ చీఫ్.. భారతీయులు  ఉద్యోగ, వ్యాపార రీత్యా ఏ దేశంలో సెటిల్ అయినా..  మాతృభూమి సంక్షేమం కోసం పాటుపడుతూనే.. ఇండియన్ సోల్ ను మరవకూడదన్నారు.  

ప్రకృతి,  సమాజం,  వ్యక్తిగత జీవితం ఒకదానికొకటి నష్టం కలిగించుకోకుండా సమన్వయంతో సహజీవనం సాగించడమే భారత జ్ఞానమని భగవత్ పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో  భారత్ అగ్రమాని అని పేర్కొన్న ఆయన,  ప్రాచీన కాలం నుంచీ గణితం, జ్యోతిష్యం, ఆయుర్వేదం వంటి విశిష్ట రంగాల్లో ఇండియా ప్రపంచానికి మార్గదర్శనం చేసి విశ్వగురువు హోదా సాధించిందన్నారు. 

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొని ఉందనీ,   పర్యావరణ ముప్పులు ఎదురవుతున్నాయనీ పేర్కొన్న ఆయన వాటికి ప్రాచీన భారత జీవనశైలిలోనే పరిష్కారాలు ఉన్నాయని ఉద్ఘాటించారు.    ఆర్ఎస్ఎస్  శతాబ్ది ఉత్సవాలకు చేరువవుతున్న ఈ సందర్భంలో మోహన్ భగవత్  ఉత్తర అమెరికా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.  

{Mohan Bhagwat Message to NRIs, RSS, Overseas Indians, Canada speech, India Vishwa Guru,  Indians abroad, Telugu One}