జీ7 సదస్సు.. మోడీ, ట్రంప్ భేటీ.. రఫేల్ ఒప్పందం

posted on: Jun 14, 2026 12:51PM

మధ్యప్రాచ్య యుద్ధ ఉద్రిక్తతల మధ్య.. భారత్‌ విదేశాంగ–రక్షణ సమీకరణాలపై సమగ్ర విశ్లేషణ చేస్తే..
ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు, 2026 జూన్ 15–17 తేదీలలో ఎవియాన్-లెస్-బేన్  ఫ్రాన్స్‌లో జరగబోయే 52వ జీ7 శిఖరాగ్ర సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరు వియాన్ మరోసారి ప్రపంచ దౌత్యరంగ దృష్టిని ఆకర్షించింది. 

ఇరాన్‌తో యుద్ధ పరిస్థితులు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, AI భవిష్యత్తు, వంటి అంశాలతో పాటు, మోడీ–ట్రంప్ భేటీ, 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదన వంటి అంశాలు భారత విదేశాంగ–రక్షణ వ్యూహానికి కీలక మలుపు కావచ్చు.  

ఇందులో మొద‌టి ముఖ్యాంశం- 2026 జీ7 సదస్సు వేదిక ఎవియాన్-లెస్-బేన్, ఫ్రాన్స్ కాగా, రెండోది..  మోడీ–ట్రంప్ భేటీ, ఇరాన్ యుద్ధం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, క్వాడ్ అజెండా – ఇవే ప్రధాన దౌత్యాంశాలుగా నిలిచాయి. మూడోది-  భారత వైమానిక దళం కోసం 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదన – సుమారు రూ.3.25 లక్షల కోట్ల విలువ,  మేక్ ఇన్ ఇండియా  కింద 96 విమానాల స్థానిక తయారీ కాగా.. నాలుగు- అమెరికా ప్రతిపాదించిన F-35 స్టెల్త్ విమానాలను భారత్ దాదాపుగా తిరస్కరించింది. 4.5-తరం మల్టీరోల్ ఫైటర్‌గా రఫేల్‌ను ఎంచుకునే దిశగా ముందుకు సాగుతోంది. ఐదు-  భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం, రష్యా చమురు దిగుమతులు, క్వాడ్, ఇండో–పసిఫిక్ – ఇవన్నీ మోదీ–ట్రంప్ సంభాషణలోని క‌ఠిన‌మైన అంశాలు.

జీ7 అనేది ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన ఏడు ఆర్థిక వ్యవస్థల సమూహం,  కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్, తో పాటు యూరోపియన్ యూనియన్ కూడా సభ్యత్వ బాధ్యతలతో పాల్గొంటుంది.  

ఈ వేదికలో మాక్రో ఆర్థిక అసమతుల్యతలు, వాణిజ్య ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయ సంక్షోభాలు,
పై సమన్వయం, G20 ఆర్థిక సమన్వయానికి పూరకంగా పనిచేస్తుంది.  

ఎవియాన్-లెస్-బేన్ – రెండోసారి విష‌యానికి వ‌స్తే, జీ7 వేదిక, ఎవియాన్-లెస్-బేన్ 2003లో 29వ G8 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత, 2026లో మళ్లీ జీ7 వేదికగా నిలుస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నారు. భారత్, బ్రెజిల్, కెన్యా, దక్షిణ కొరియా, సిరియా వంటి ఆహ్వానిత దేశాలలో భారత్‌కు ప్రత్యేక ప్రాధాన్యత‌ క‌ల్పిస్తున్నారు. 

భారత్‌ – ఆహ్వానిత దేశం నుంచి  స్ట్రాటజిక్ ప్లేయర్ దిశగా.. మాక్రాన్ 2026 జీ7 సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీని అధికారికంగా ఆహ్వానించిన విషయం, భారత్–ఫ్రాన్స్ రక్షణ–పారిశ్రామిక భాగస్వామ్యం,
ఇండో–పసిఫిక్ వ్యూహంలో భారత్‌ పాత్రను ప్రతిబింబిస్తోంది.  

2017 – వాషింగ్టన్‌లో మొదటి అధికారిక భేటీ జ‌రిగింది. వాణిజ్యం, రక్షణ, కౌంటర్ టెర్రరిజం ప్రధాన అంశాలుగా మారాయి. 2019 – హ్యూస్టన్‌లో హౌడీ- మోడీ కార్యక్రమం ద్వారా.. భారత–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రజా మద్దతు ప్రదర్శన సైతం నిర్వ‌హించారు. 2020 – ట్రంప్ భారత పర్యటనలో అహ్మదాబాద్  నమస్తే ట్రంప్ సభ జ‌ర‌గ్గా, రక్షణ ఒప్పందాలు, ఇండో–పసిఫిక్ చర్చ సైతం జ‌రిగింది.

ఫిబ్రవరి 2025లో మోడీ- అమెరికా పర్యటన తర్వాత, ట్రంప్ వైట్‌హౌస్‌కు తిరిగి వచ్చిన తరువాత 
ఇద్దరూ ప్రత్యక్షంగా కలిసిన సందర్భం లేదు. 2026 జీ7 సదస్సు ఈ ఖాళీని భర్తీ చేసే మొదటి వేదికే అయ్యింది.

MRCA నుంచి MRFA వరకు – రఫేల్ కథ ఎలా సాగిందో చూస్తే.. భారత వైమానిక దళం- IAF కోసం మల్టీరోల్ యుద్ధ విమానాల కొనుగోలు కథ, దాదాపు రెండు దశాబ్దాలుగా సాగుతోంది.

MMRCA టెండర్ 2007–2012  మ‌ధ్య కాలం నాటిది కాగా.. 126 మల్టీరోల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదన. పోటీలో.. రఫేల్, యూరోఫైటర్ టైఫూన్, F-16, F/A-18, మిగ్-35, గ్రిపెన్. సాంకేతిక మూల్యాంకనంలో డాసాల్ట్ రఫేల్ ముందంజలో నిలిచింది. ఒప్పందం నిలిచిపోవడం
లైసెన్స్ ఉత్పత్తి, ఖర్చు పెరుగుదల, బాధ్యతల బదిలీ వంటి అంశాలపై విభేదాలున్నాయి. ఇక‌
126 విమానాల MMRCA ఒప్పందం అమలులోకి రాకుండా నిలిచిపోయింది.

2016 రఫేల్ ఇంటర్-గవర్నమెంటల్ ఒప్పందం ఎలాంటిదంటే.. 36 రఫేల్ విమానాల కొనుగోలు అంటే, 2 స్క్వాడ్రన్లు.  సుమారు 7.8 బిలియన్ యూరోల‌ విలువైన‌ది. ఆఫ్‌సెట్, టెక్నాలజీ భాగస్వామ్యం అంశాలపై దేశీయ రాజకీయ వివాదాలుగా ఉంది. మ‌ల్టీ రోల్ ఫైట‌ర్ ఎయిర్ క్రాష్ట్ లైన MRFA  కొత్త దశ ఎలాంటిదో చూస్తే.. IAF అవసరాలను దృష్టిలో పెట్టుకుని 114 మల్టీరోల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదన జ‌రిగింది. 4.5-తరం మల్టీరోల్ ఫైటర్ – స్టెల్త్ పూర్తి సామర్థ్యం కాకపోయినా, అధునాతన ఏవియానిక్స్, సెన్సర్లు, నెట్‌వర్క్-సెంట్రిక్ యుద్ధ సామర్థ్యాలు వంటివి కీలకంగా మారాయి.

ఇక ప్రస్తుత ప్రతిపాదన ప్రకారం.. 18 రఫేల్ జెట్‌లు – నేరుగా ఫ్రాన్స్ నుంచి సరఫరా.
96 విమానాలు.. మేక్ ఇన్ ఇండియా కింద భారతదేశంలో తయారీ. ఇది భారత్‌ ఇప్పటివరకు చేసిన అతిపెద్ద రక్షణ కొనుగోళ్లలో ఒకటి కావచ్చు. సుమారు రూ.3.25 లక్షల కోట్ల విలువగా అంచనా.

రఫేల్ ఒప్పందం.. ఒక‌ సాంకేతిక, వ్యూహాత్మక, రాజకీయ విశ్లేషణగా చూస్తే..  F-35 వ‌ర్సెస్ రఫేల్ – సాంకేతిక–రాజకీయ స‌మ‌తూక‌మేనా? అన్న ప్ర‌శ్న‌కు ఆస్కార‌మేర్ప‌డుతుంది. అమెరికా F-35 స్టెల్త్ యుద్ధ విమానాల విక్రయ ప్రతిపాదనను భారత్ దాదాపుగా తిరస్కరించిన ప‌రిస్థితిని, ప‌రిశీలిస్తే ఇందులో కేవ‌లం సాంకేతిక అంశాలు మాత్రమే కాదు, వ్యూహాత్మక స్వాతంత్రం కూడా ఉంది. రష్యా–ఫ్రాన్స్–ఇజ్రాయెల్‌తో ఉన్న రక్షణ సంబంధాల‌తో కూడా ఇది ముడిపడి ఉంది.

F-35.. 5వ తరం స్టెల్త్ ఫైటర్ ప‌రిస్థితేంటో చూస్తే.. అధునాతన సెన్సర్ ఫ్యూజన్, నెట్‌వర్క్-సెంట్రిక్ యుద్ధ సామర్థ్యం క‌లిగిన‌ది. కానీ, అమెరికా ఎగుమతి నియంత్రణలు, సాఫ్ట్‌వేర్, మిషన్ డేటా ఫైళ్ల‌పై నియంత్రణ, CAATSA, ఇతర న్యాయపరమైన బంధనలు, భారత్‌కు స్వతంత్ర ఆపరేషనల్ స్వేచ్ఛను పరిమితం చేసే ప్రమాదం ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఇక రఫేల్ 4.5-తరం ఎయిర్ క్రాఫ్ట్. స్టెల్త్ పూర్తి స్థాయిలో కాకపోయినా, అధునాతన ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్,
స్పెక్ట్రా EW సిస్టమ్, బహుళ పాత్రలు..  ఎయిర్ సుపీరియారిటీ, గ్రౌండ్ అటాక్, న్యూక్లియర్ డెలివరీ వంటివి ప్ర‌ధానాంశాలుగా ఉన్నాయి. భారత్‌ దృష్టిలో.. సాంకేతిక సామర్థ్యం ప్ల‌స్ రాజకీయ స్వాతంత్రం  కూడా క‌ల‌గ‌ల‌సి  ఉన్నాయి. ఫ్రాన్స్‌తో దీర్ఘకాలిక రక్షణ–పారిశ్రామిక భాగస్వామ్యం సైతం  ముఖ్య‌మైన‌వే. 
ఈ రెండింటి కలయిక రఫేల్‌కు బలం చేకూర్చింది.  

ఇక మేక్ ఇన్ ఇండియా – రఫేల్ ఒప్పందంలో పారిశ్రామిక అర్థం ఎలాంటిదో చూస్తే.. 96 విమానాల స్థానిక తయారీ ప్రతిపాదన, భారతీయ రక్షణ పరిశ్రమకు టెక్నాలజీ బదిలీ, సప్లై చైన్‌లో భారత కంపెనీల భాగస్వామ్యం, ఉద్యోగావకాశాలు, నైపుణ్యాభివృద్ధి, వంటి అంశాలకు దారితీస్తుంది. కానీ, లైసెన్స్ ఉత్పత్తి ఖర్చు, టెక్నాలజీ బదిలీ పరిమితులు, ఫ్రెంచ్ కంపెనీల నియంత్రణ, వంటి అంశాలు భారత పారిశ్రామిక స్వాతంత్రంపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంది.

ఏమాట‌కామాట, ఇది భారతీయ రక్షణ పరిశ్రమకు అవకాశమూ, బంధనమూ రెండూ. స్వదేశీ 5వ తరం AMCA, LCA Mk2 వంటి ప్రాజెక్టులపై దీర్ఘకాలిక ప్రభావం కూడా గమనించాల్సిన అంశమే. 

న్యాయపరమైన కోణాలు, రక్షణ కొనుగోళ్లు, అంతర్జాతీయ ఒప్పందాలు ఎలాంటివంటే..  భారత రక్షణ కొనుగోలు విధానం- DPP/DAP నేపథ్యం ఒక సారి  ప‌రిశీలించాలి. భారత రక్షణ కొనుగోళ్లు ఎలా సాగుతాయంటే అవి డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజ‌ర్- DPP, త‌ర్వాత డిఫెన్స్ అక్విజిష‌న‌న్ ప్రొసీజ‌ర్- DAP 
కింద జరుగుతాయి. ఇందులో బై- గ్లోబ‌ల్,  బై అండ్ మేక్, బై ఇండియ‌న్- IDDM  వంటి కేటగిరీలుంటాయి.

ఇక 114 రఫేల్ ప్రతిపాదన ఎలాంటిదంటే,, ఇందులో బై అండ్ మేక్ లేదా స‌మాన కేట‌గిరీ కింద‌కు వ‌స్తుంది. ఆఫ్‌సెట్ బాధ్యతలు, టెక్నాలజీ బదిలీ, స్థానిక విలువ వంటివి  కీల‌కం.  

అంతర్జాతీయ న్యాయపరమైన అంశాలు, CAATSA, ఎగుమతి నియంత్రణలు వంటి వాటితో పాటు 
అమెరికా F-35 కొనుగోలు చేస్తే.. కౌంట‌రింగ్ అమెరికాస్ అడ్వైజ‌రీస్  త్రూ శాంక్ష‌న్స్ యాక్ట్, తో పాటు ఇంట‌ర్నేష‌న‌ల్ ట్రాఫిక్ ఇన్ ఆర్మ్స్ రెగ్యులేష‌న్స్  వంటి నిబంధనలు భారత రక్షణ–విదేశాంగ స్వాతంత్ర్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 

భారత్‌ రష్యా నుంచి S-400, చమురు, ఇతర రక్షణ సామగ్రి కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో,
F-35 + S-400 కలయికపై అమెరికా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉండేది.
రఫేల్ ఎంపిక, ఈ న్యాయపరమైన సంక్లిష్టతల నుంచి బయటపడే వ్యూహాత్మక మార్గంగా కూడా చూడవచ్చు.

జీ7 ఎవియాన్ సదస్సులో మోడీ–ట్రంప్ భేటీ జరిగే అవకాశంపై చర్చకు వచ్చే అంశాలు ఎలాంటివో ప‌రిశీలిస్తే.. వాటిలో వాణిజ్య విభేదాలు, టారిఫ్‌లు, డిజిటల్ ట్యాక్స్, డేటా లోకలైజేషన్, ఫార్మా–అగ్రి–IT రంగాలపై వివాదాలున్న‌ట్టు తెలుస్తోంది. ఒక సంవత్సరం పైగా చర్చల్లో ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంను ఖరారు చేయాలనే లక్ష్యం. రష్యా చమురు కొనుగోలు, భారత్‌ రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగించడం, అమెరికా–యూరోపియన్ ఆంక్షల నేపథ్యం వంటివి కీల‌కంగా  ఉన్నాయి.

ట్రంప్ శైలిలో చెబితే  నేనే భారత్–పాకిస్తాన్ వివాదాన్ని 2025 నాటికి ముగించడంలో సహాయపడ్డాను   వంటి రాజకీయ వాదనలు, ప్రజా వేదికలపై క్రెడిట్ తీసుకునే ధోరణి. క్వాడ్, ఇండో–పసిఫిక్
చైనా విస్తరణ, దక్షిణ చైనా సముద్రం, తైవాన్, ఇండో–పసిఫిక్ సమీకరణ. భారత్‌ పాత్రపై అమెరికా–జపాన్–ఆస్ట్రేలియా అంచనాలు వంటివి చ‌ర్చ‌కు వ‌స్తాయి.

ఇరాన్ యుద్ధం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు – జీ7 అజెండాలో భారత్‌ స్థానం వంటి  అంశాల‌పై కొన్ని  అంత‌ర్జాతీయ మీడియా క‌థ‌నాల ప్ర‌కారం..  2026 జీ7 సదస్సు అజెండాలో ఇరాన్‌తో యుద్ధ పరిస్థితులు,
మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లు, ప్రధాన చర్చాంశాలుగా నిలుస్తున్నాయి.  

చమురు దిగుమతుల భద్రత, డయాస్పోరా భద్రత అంటే, గల్ఫ్‌లో భారతీయులు- వారి సేఫ్టీ, ఇరాన్‌తో చాబహార్ ప్రాజెక్టు, ప్రాంతీయ కనెక్టివిటీ, వంటి అంశాలు జీ7 చర్చలతో నేరుగా ముడిపడి ఉన్నాయి. 

ఇక రఫేల్, పారదర్శకత, బాధ్యత వంటి అంశాలను గ‌మ‌నిస్తే.. రఫేల్ ఒప్పందంపై గతంలో.. ధరల పారదర్శకత, ఆఫ్‌సెట్ భాగస్వామ్య కంపెనీల ఎంపిక, రాజకీయ ఆరోపణలు, వంటి అంశాలు తీవ్ర  చర్చకు దారితీశాయి.

114 రఫేల్ ప్రతిపాదన సందర్భంలో.. పారదర్శకత, న్యాయపరమైన సమీక్ష, పార్లమెంటరీ పర్యవేక్షణ,
CAG, PAC వంటి సంస్థల పాత్ర, పై ప్రశ్నలు మళ్లీ ముందుకు రావడం సహజం.

మొత్తంగా చూస్తే రక్షణ కొనుగోళ్లు జాతీయ భద్రత పేరుతో పూర్తిగా అస్పష్టతలో ఉండకూడదు. పారదర్శకత ప్ల‌స్ వ్యూహాత్మక గోప్యత మధ్య సమతుల్యతే ప్రజాస్వామ్య బాధ్యతగా క‌నిపిస్తోంది. 

మ‌న ఎయిర్ సుపీరియారిటీ, డీప్ స్ట్రైక్, న్యూక్లియర్ డెలివరీ సామర్థ్యాలు బలోపేతం అవుతాయి. స‌రిగ్గా అదే స‌మ‌యంలో.. స్క్వాడ్రన్ బలం పెరుగుదల, పాకిస్తాన్–చైనా ద్వంద్వ సవాళ్లకు ప్రతిస్పందన.
స్వదేశీ ప్రాజెక్టులు- AMCA, LCA Mk2, TEDBF వంటి ప్రాజెక్టులపై బడ్జెట్, ప్రాధాన్యత ప్రభావం.
విదేశీ ప్లాట్‌ఫారమ్‌లపై అధికంగా ఆధారపడటం, టెక్నాలజీ స్వాతంత్ర‌ లక్ష్యానికి విరుద్ధం అనే విమర్శ సైతం  ఎదురు కావ‌చ్చు.

మోడీ–ట్రంప్ భేటీ – భారత్‌ విదేశాంగ సమీకరణాలపై సంకేతాలు ఎలాంటివంటే, ఈ భేటీ నుంచి వచ్చే సంకేతాలు.. వాణిజ్య ఒప్పందం, IT, ఫార్మా, అగ్రి, డిజిటల్ ట్రేడ్ – భారతీయ వ్యాపార వర్గాలకు అవకాశాలు, కానీ, డేటా, ప్రైవసీ, ట్యాక్స్ అంశాల్లో ఒత్తిడి వంటివి క‌నిపిస్తున్నాయి. 

రష్యా చమురు, రక్షణ భారత్  స్ట్రాటజిక్ ఆటోనమీని  కాపాడుకుంటూ, అమెరికాతో భాగస్వామ్యాన్ని కొనసాగించే సున్నిత సమతుల్యత. క్వాడ్, ఇండో–పసిఫిక్, చైనా వ్యతిరేక సమీకరణలో భారత్‌ పాత్రపై
ట్రంప్ శైలిలో స్పష్టమైన, కొన్నిసార్లు కఠినమైన మాటలు రావచ్చు.

రూ.3.25 లక్షల కోట్ల రఫేల్ ఒప్పందం నేపథ్యంలో.. రక్షణ ఖర్చు, జాతీయ భద్రత, సార్వభౌమత్వం, ప్రాంతీయ సమీకరణ. సామాజిక రంగాలు, ఆరోగ్యం, విద్య, గ్రామీణ అభివృద్ధి, ఉద్యోగాలు వంటివి.. ప‌బ్లిక్ డిబేట్స్ లో..  ఇంత భారీ రక్షణ ఖర్చు అవసరమా? స్వదేశీ తయారీకి ఎంత ప్రాధాన్యం? వంటి ప్రశ్నలు తప్పనిసరిగా ముందుకు వస్తాయి.

జర్నలిస్టిక్ లాంగ్వేజీలో చెప్పాలంటే.. భద్రత వ‌ర్సెస్ అభివృద్ధి మధ్య సమతుల్యతను ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు. కానీ, భారత్‌ భౌగోళిక–రక్షణ వాస్తవాలు కూడా నిర్లక్ష్యం చేయలేనటువంటి నిజం.

జీ7 ఎవియాన్ – భారత్‌ కోసం టెస్ట్ కేస్ సదస్సు, 2026 జీ7 ఎవియాన్ సదస్సు, మోడీ–ట్రంప్ భేటీ,
114 రఫేల్ ఒప్పందం, ఇరాన్ యుద్ధం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, క్వాడ్, ఇండో–పసిఫిక్, వంటి అంశాల సమ్మేళనంతో, భారత్‌ విదేశాంగ–రక్షణ సమీకరణాలకు ఒక  టెస్ట్ కేస్ మీట్ గా ఇది నిలుస్తోంది.

ఒక ప‌క్క భారత్‌ స్ట్రాటజిక్ ఆటోనమీను కాపాడుకుంటూ, మ‌రో ప‌క్క అమెరికా, ఫ్రాన్స్, రష్యా, మధ్యప్రాచ్య దేశాలు మధ్య .. సున్నిత సమతుల్యతను నిర్వహించాల్సిన పరిస్థితి క‌నిపిస్తోంది. ఈ సదస్సు తర్వాత.. రఫేల్ ఒప్పందం ముందుకు సాగుతుందా? మోడీ–ట్రంప్ భేటీ నుంచి వాణిజ్య–రక్షణ ఒప్పందాలకు స్పష్టమైన మార్గరేఖ వస్తుందా?  అనే ప్రశ్నలకు సమాధానాలు, భారత రాజకీయ–రక్షణ–విదేశాంగ చర్చల్లో దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది.

 -సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.  

google-ad-img
    Related Sigment News
    • Loading...