TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మియాపూర్ సీఐకి జైలు, జరిమానా: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.!

Published on: Thu Nov 5, 2026 11:50AM

కోర్టు జారీ చేసిన స్పష్టమైన ఆదేశాలను పాటించకుండా ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన పోలీసు అధికారికి తెలంగాణ హైకోర్టు జైలు శిక్ష విధించింది. దానితో పాటు జరిమానా కూడా విధించింది.  హఫీజ్‌పేటలోని ఒక వివాదాస్పద ఆస్తి విషయంలో కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు గాను, మియాపూర్ సీఐ ఎం. ప్రేమ్ కుమార్‌కు నాలుగు వారాల జైలు  శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.  

 వివరాలిలా ఉన్నాయి.   హఫీజ్‌పేట పరిధిలో ఉన్న ఒక   భూమికి సంబంధించి సివిల్ కోర్టు నుంచి శాశ్వత నిరోధక ఉత్తర్వులు  జారీ అయ్యాయి. ఆ ఉత్తర్వులు పొందిన వ్యక్తులకు తగిన రక్షణ కల్పించాలని గతంలో ఉన్నత న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. అయితే, బాధితులు ఆశ్రయించినప్పటికీ స్థానిక పోలీసులు ఆ ఆదేశాలను అమలు చేయలేదు. ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వలు బేఖాతరు చేశారన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి.

దీనిపై బాధితులు కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు పోలీసుల తీరుపై  ఆగ్రహం వ్యక్తం చేసింది.  బాధితుల కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారించిన  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి. భాస్కర్ రెడ్డి  చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యతలో ఉన్న ఒక పోలీసు అధికారి  కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం గర్హనీయమని పేర్కొంటూ,  కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిన సీఐకు శిక్ష  విధించింది.  

[Miyapur CI Prem Kumar Jail Sentence, Telangana High Court,  Contempt Case, Hafizpet Property,  Police Protection Case, TeluguOne]