టీడీపీ మహిళా కార్యకర్తల ఆప్యాయతే కొండంత బలం : నారా లోకేష్
Published on: Fri Aug 28, 2026 4:49PM
.webp)
టీడీపీ మహిళా కార్యకర్తల ఆప్యాయత, అండదండలు తనకు కొండంత బలమని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఒంగోలు పర్యటనలో భాగంగా టీడీపీ కార్యకర్తల సమన్వయ సమావేశానికి హాజరైన మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ మహిళా నాయకులు, కార్యకర్తలు ఆత్మీయంగా రాఖీలు కట్టారు. రక్షాబంధన్ సందర్భంగా మహిళా కార్యకర్తలు తనకు రాఖీలు కట్టడంతో మంత్రి లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. రాఖీలు కట్టిన మహిళా కార్యకర్తలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారితో ఆత్మీయంగా మాట్లాడారు. “నాకు తోబుట్టువులు లేకపోయినా.. మీరు నన్ను సొంత అన్న, తమ్ముడిలా ఆదరిస్తున్నారు. మీరే నా అక్కలు, నా చెల్లెళ్లు. మీరు చూపిస్తున్న ఆప్యాయత, అందిస్తున్న అండదండలే నాకు కొండంత బలం” అని మంత్రి నారా లోకేష్ అన్నారు.
Minister Nara Lokesh, Tour of the Ongoles, Raksha Bandhan, TDP, CM Chandrababu, Telugu news, Telugu One


