Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కొలంబియాలో కుప్పకూలిన విమానం.. వంద మంది మృతి!
posted on: Mar 24, 2026 9:54AM

దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో సోమవారం (మార్చి 23) ఒక మిలిటరీ విమానం కుప్పకూలిన సంఘటనలో వంద మంది మృత్యువాత పడ్డారు. ఆ విమానం టెకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం కారణంగా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 125 మంది సైనికులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
దాదాపు 125 మంది సైనికులతో ప్రయాణిస్తున్న ఒక మిలిటరీ రవాణా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది. కొలంబియాలోని పుటుమాయో ప్రావిన్స్‌లోని ప్యూర్టో లెగుయిజామో విమానాశ్రయం రన్‌వే పైనుంచి గాల్లోకి ఎగిరిన తరువాత రెండు కిలోమీటర్ల దూరంలోపే విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి భూమికి వేగంగా దూసుకొచ్చింది. విమానం కూలిన వెంటనే భారీ శబ్దంతో పేలుడు సంభవించి, ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది.
ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. విమాన శకలాల నుంచి పలువురిని గాయాలతో బయటకు తీసుకువచ్చి వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళణ వ్యక్తం అవుతోంది.



.webp)


