TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మియాపూర్ మెడికో సృజన హత్య కేసు..సంచలన విషయాలు వెలుగులోకి.!

Published on: Mon Oct 5, 2026 12:42PM

మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది. సృజనను హత్య చేసినట్లు అనుమానిస్తున్న రవి వ్యవహారశైలికి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రవి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తుండగా.. అతడి స్వగ్రామమైన మహబూబ్‌నగర్‌లో పోలీసులకు కీలక సమాచారం లభించింది. రవి గతంలో తన తల్లిదండ్రులను డబ్బుల కోసం వేధించేవాడని గ్రామస్తులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. తరచూ వారిపై దాడి చేస్తూ ఇబ్బందులకు గురిచేసేవాడని తెలిపారు. రవి ప్రవర్తనతో విసిగిపోయిన గ్రామస్తులు మూడు నెలల క్రితమే అతడిని గ్రామం నుంచి వెలివేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత రవి మళ్లీ గ్రామానికి రాలేదని గ్రామస్తులు చెప్పినట్లు తెలుస్తోంది.

మరోవైపు.. డబ్బుల అవసరం ఉన్న సమయంలో రవి, సృజనను బంగారు చైన్ అడిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని నమ్మిన సృజన తన బంగారు గొలుసును రవికి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే నెలలు గడిచినా చైన్ తిరిగి ఇవ్వకపోవడంతో.. దానిని తిరిగి ఇవ్వాలని సృజన రవిని కోరినట్లు పోలీసులు గుర్తించారు.ఈ క్రమంలోనే బంగారు చైన్ తిరిగి ఇస్తానని చెప్పి సృజనను హన్మకొండ నుంచి హైదరాబాద్‌కు రవి పిలిపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మియాపూర్‌లోని గ్రాండ్ బ్రోక్హిల్ హోటల్‌లో రూమ్ నంబర్ 502ను తీసుకున్న రవి.. తన స్నేహితులతో కలిసి అక్కడ పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది.

సృజన హోటల్‌కు వచ్చిన తర్వాత రవి స్నేహితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ రాత్రి రవి, సృజన మాత్రమే గదిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరుసటి రోజు హోటల్ సిబ్బందికి రూమ్‌ను కొనసాగిస్తున్నామని చెప్పి రవి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.ఆ తర్వాత మూడు రోజుల పాటు గది తలుపులు తెరుచుకోలేదు. గది నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని గదిని పరిశీలించగా.. కుళ్లిపోయిన స్థితిలో సృజన మృతదేహం కనిపించింది.

దీంతో సృజనను హత్య చేసిన అనంతరం రవి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం రవి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. మహబూబ్‌నగర్‌తో పాటు అతడు వెళ్లే అవకాశం ఉన్న ప్రాంతాల్లోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. రవి పట్టుబడితే.. సృజనను హత్య చేయడానికి అసలు కారణమేంటి? బంగారు చైన్ వ్యవహారం ఎంతవరకు కారణమైంది? హత్యకు ముందు ఏం జరిగింది? అనే కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

 

 

 

[ Miapur Srujana Murder, Srujana Murder Case, Miapur Murder Case, Medical Student Murder, Srujana Murder, Ravi Kumar, Ravi Suspect, Hyderabad Crime, Hyderabad Murder, Grand Brokhill Hotel, Miapur Hotel Murder, Mahabubnagar, Gold Chain, Love Affair, Murder Investigation, Telangana Crime, Hyderabad Police, Crime News, Medico Murder, Srujana Case ]