TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మొగల్‌కానా వద్ద ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం..!

Published on: Sun Aug 23, 2026 2:38PM

 

 గుడిమల్కాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మొగల్‌కానా వద్ద ఓ ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం నెలకొంది. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయాందో ళనకు గురయ్యారు. గోదాంలో పెద్ద మొత్తంలో ఫర్నిచర్, ఇతర సామగ్రి ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగలు ఆ ప్రాంతం మొత్తం చుట్టుముట్టాయి. ఫర్నిచర్ గోదాం చుట్టుపక్కల పలు ఇతర గోదాంలు కూడా ఉండటంతో మంటలు వాటివైపు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. 

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్‌సర్క్యూట్‌ కారణమా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. పోలీసులు కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన అనంతరం గోదాంలో జరిగిన ఆస్తి నష్టం, అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలపై అధికారులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

Massive fire breaks out in furniture warehouse at Mogalkana, Gudimalkapur, Furniture warehouse, Fire accident