TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డ్రగ్స్ స్మగ్లింగ్ కు అడ్డా: ఒడిశా ఎయిర్ పోర్టు.. రెండేళ్లలో రూ.300 కోట్ల గంజాయి సీజ్.!

Published on: Mon Oct 26, 2026 10:23AM

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం  డ్రగ్ స్మగ్లింగ్‌కు అడ్డాగా మారింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డీఆర్ఐ,  కస్టమ్స్ అధికారుల దర్యాప్తులో ఈ విషయం వెల్లడైంది. గత రెండేళ్లగా ఈ విమానాశ్రయం నుంచీ  భారీ ఎత్తున గంజాయి స్మగ్లింగ్ జరుగుతోందని తేలింది.   గడచిన రెండేళ్లలో ఈ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు జరిపిన   దాడులు,  తనిఖీల్లో   300 కోట్ల రూపాయల విలువైన గంజాయి  పట్టుకున్నారు.   40 మంది నిందితులను అధికారులు అరెస్టు చేశారు.    థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నుంచి ఈ రాకెట్‌ను ఆపరేట్  అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే.. ఈ స్మగ్లింగ్ కు ప్రధాన సూత్రధారి అయిన నిందితుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. 

 ఇతర రాష్ట్రాల్లోని విమానాశ్రయాలతో పోలిస్తే భువనేశ్వర్ ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ నిఘా కాస్త తక్కువగా ఉంటుందన్న భావిస్తున్న స్మగ్లర్లు.. తమ అక్రమ రవాణాలు ఈ విమానాశ్రయాన్ని ఎంచుకున్నారని అధికారులు భావిస్తున్నారు.  అయితే అధికారులు పదే పదే దాడులు చేసి నిందితులను పట్టుకుంటన్నా.. స్మగ్లింగ్ ఆగడం లేదని అంటున్నారు.  

బ్యాంకాక్ నుంచి డ్రగ్స్ అక్రమ రవాణా కోసం.. కోసం స్మగ్లర్లు కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. చాక్లెట్లు, బిస్కెట్లు,  ఇతర ఆహార పదార్థాల ప్యాకెట్ల మాటున గంజాయిని ప్యాక్ చేసి తీసుకొస్తున్నారు. అంతేకాకుండా..  ట్రావెల్ బ్యాగుల అడుగుభాగంలో ప్రత్యేకంగా  రహస్య అరలు  ఏర్పాటు చేసి  డ్రగ్స్ తరలిస్తున్నారు.

 

అధికారుల కంటికి చిక్కుతున్నవి కేవలం కొన్ని మాత్రమేనని, చాలా వరకు అక్రమ రవాణా కేసులు బయటపడకుండానే జరిగిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వరుస ఘటనలు భువనేశ్వర్ ఎయిర్‌పోర్టు భద్రతపై తీవ్రమైన సందేహాలను లేవనెత్తుతున్నాయి.   ఎన్నో అరెస్టులు జరుగుతున్నప్పటికీ, ఈ గ్లోబల్ స్మగ్లింగ్ నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల గుర్తించి అదుపులోకి తీసుకుంటే తప్ప ఈ స్మగ్లింగ్ ఆగదని అంటున్నారు. 

[Marijuana  Smuggling Hub, Bhubaneswar Airport,  DRI Raids, International Drug trafficking, Bangkok smuggling, Telugu One]