శివలింగానికి నాగుపాముల ప్రదక్షణ: దైవ ఘటన అంటున్న భక్తులు.!
Published on: Mon Oct 5, 2026 12:16PM

నెల్లూరు జిల్లాలో విస్మయపరిచే సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని ఓ ప్రముఖ శివాలయంలో ఏకకాలంలో మూడు నాగుపాములు శివలింగాకి ప్రదక్షిణ చేసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సాధారణంగా ఆలయాల్లో పాముల సంచారం మామూలే. అయితే ఒకేసారి మూడు సర్పాలు గర్భాలయంలోకి ప్రవేశించి శివలింగం చుట్టూ తిరగడం చూసిన భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయులైపోయారు.
.webp)
నెల్లూరుమనుబోలు బీసీ కాలనీ సమీపంలో వెలసిన శ్రీకాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఉదయం వేళ ఆలయం తెరిచి ఉన్న సమయంలో మూడు తాచు పాములు గర్భగుడిలోకి ప్రవేశించాయి. ఆ మూడు సర్పాలు శివలింగాన్ని చుట్టుకుని కొద్దిసేపు అలాగే పడగవిప్పి నిలబడ్డాయి. పాములను చూసి తొలుత ఆలయానికి వచ్చిన భక్తులు భయాందోళనలకు గురయ్యారు. అయితే ఆ మూడు పాములూ శివలింగాన్ని చుట్టుకుని పడగ విప్పి నిశ్చలంగా ఉండటం, ఆ తరువాత కూడబలుక్కున్నట్లు ఒకదాని వెంట ఒకటిగా శివలింగానికి ప్రదక్షిణలు చేయడం అక్కడ ఉన్న వారిని విస్మయానికి గురి చేసింది.
ప్రదక్షిణ పూర్తి అయిన తరువాత ఆ మూడు పాములూ ఆలయ ప్రాంగణంలోనే ఉన్న పుట్టలోనికి వెళ్లిపోయాయి. ఈ మొత్తం ఘటనను భక్తులు కొందరు తమ సెల్ ఫోన్ లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. సోమవారం పరమశివునికి ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. అలాంటి పవిత్రమైన సోమవారం (అక్టోబర్ 5) నాడే తాచుపాములు శివలింగానికి ప్రదక్షిణ చేయడం దైవ ఘటనేనని భక్తులు అంటున్నారు.

అదలా ఉంటే.. ఈ ఆలయంలో నాగుపాములు ప్రత్యక్షమవడం ఇదే మొదటిసారి కాదని అక్కడి వారు చెబుతున్నారు. గత ఏడాది మే 17న ప్రత్యేక అభిషేకం జరుగుతున్న సమయంలోనూ ఒక నాగుపాము శివలింగంపై పడగవిప్పి భక్తులకు దర్శనమిచ్చింది. అలాగే, గత ఏడాది అక్టోబర్‌లో నాగుల చవితి పర్వదినం సందర్భంగా కూడా సరిగ్గా ఇదే ఆలయంలో రెండు నాగుపాములు శివలింగం పక్కన కనిపించాయి. ఇలా తరచూ ఈ క్షేత్రంలో నాగసర్పాలు ప్రత్యక్షమవడం వెనుక ఏదో దివ్యశక్తి ఉందని, ఇది ఆ ఆలయ విశిష్టతను చాటుతోందని స్థానికులు భావిస్తున్నారు.
[Manubolu Shiva Temple, Kashi Viswanatha Temple, Shiva Lingam, Three Cobras, radakshinalu, Telugu One]


