Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పాడైపొయిన డ్రై ఫ్రూట్స్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
posted on: Mar 13, 2026 9:57PM

ఆరోగ్యాన్ని కాపాడుకోవడా నికి చాలా మంది రోజువారీ ఆహారంలో డ్రై ఫ్రూట్స్‌ను భాగం చేసుకుంటున్నారు. అయితే ఈ అవసరాన్ని కొందరు కేటుగాళ్లు దుర్వినియోగం చేస్తూ పాడైపోయిన డ్రై ఫ్రూట్స్‌ను నాణ్యమైనవిగా నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. రోజురోజుకీ కల్తీ ఆహార పదార్థాల వ్యవహారం పెరుగుతుండ టంతో అసలు ఏది, నకిలీ ఏది అన్నది గుర్తించడం ప్రజలకు కష్టంగా మారింది. కొంతమంది దొంగ వ్యాపారులు గుట్టు చప్పుడు కాకుండా ఇలాంటి అక్రమ వ్యాపారాలు చేస్తూ లక్షల్లో డబ్బులు సంపాదిస్తు న్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ఇలాంటి నకిలీ వ్యాపారాలపై హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ సిటీ సీసీఎస్ (డీడీ) స్పెషల్ క్రైమ్ టీమ్, ఫుడ్ అడల్టరేషన్ టీమ్ మరియు బహదూ ర్‌పురా పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా పాడైపోయిన మరియు అపరిశుభ్రమైన డ్రై ఫ్రూట్స్‌ను నాణ్యమైనవి గా నమ్మించి ప్రజలకు విక్ర యిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అసవా మనీష్ (42) అనే వ్యక్తి చార్మినార్ ప్రాంతంలోని చేలాపురాలో “GEM Foods (Imports and Exports)” పేరుతో ఒక గోదామును నిర్వహిస్తు న్నాడు. కావాలనే పాడైపో యిన, బూజు పట్టిన మరియు దుర్వాసన వస్తున్న డ్రై ఫ్రూట్స్‌ను సేకరించి వాటిని నాణ్యమై నవిగా మార్చి విక్రయిస్తు న్నట్లు పోలీసులు గుర్తించారు. . సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేసి మనీష్ ను అరెస్టు చేసి అతని వద్ద నుండి 30 కార్టన్ బాక్సుల్లో ఉన్న పాడైపోయిన, అపరిశుభ్ర మైన డ్రై ఫ్రూట్స్‌ను పోలీ సులు స్వాధీనం చేసుకు న్నారు.ఈ డ్రై ఫ్రూట్స్ అపరిశుభ్రమైన వాతావర ణంలో నిల్వ చేయబడి ఉండటమే కాకుండా మానవ వినియోగానికి ఏమాత్రం సురక్షితం కాదని అధికారులు తెలిపారు.
ప్రజలకు సూచన
ఆహార పదార్థాలను, ముఖ్యంగా ప్యాక్ చేసిన వస్తువులు లేదా డ్రై ఫ్రూట్స్ కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వస్తువులను కొనుగోలు చేసే ముందు వాటి నాణ్యత, వాసన, రూపాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఎవరైనా పాడైపోయిన లేదా కల్తీ ఆహార పదార్థాలను విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా ఆహార భద్రతా అధికారులకు సమాచారం అందించాలని కోరారు.


.webp)



