విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం

posted on: Jun 8, 2026 5:52PM

 

విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని SMS-1 విభాగంలో  భారీ పేలుడు సంభవించింది. CCD (Continuous Casting Department) విభాగంలో పేలుడు జరగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతూ ఉండడంతో దట్టమైన పొగలు ఆ ప్రాంతం మొత్తం వెదజల్లాయి. లాడెల్ నుంచి ద్రవ ఉక్కు నేలపై పడటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ప్రమాదంలో భారీ క్రేన్ దగ్ధమైంది.ఈసంఘటన సమయంలో అక్కడ పనిచేస్తున్న 6 నుంచి 8 మంది ఉద్యోగులు, కార్మి కులు ఉన్నట్లు సమాచారం. పలువురికి గాయాలయ్యాయి. 

గాయాలైన వారిని వెంటనే స్థానిక హాస్పిటల్ కి తరలించారు. పెద్ద ఎత్తున మంటలు చిలరేగుతూ ఉండడంతో స్థానికులు భయభ్రాంతులకు గురై అక్కడ నుండి పరుగులు తీయడమే కాకుండా ఫైర్ సిబ్బందికి సమాచారాన్ని అందించారు..వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, ప్లాంట్ అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...