బొత్స మేనల్లుడు తెలుగుదేశంలోకి.. ఉత్తరాంధ్రలో వైసీపీ ఉనికి మాత్రంగానైనా ఉంటుందా.
Published on: Wed Sep 9, 2026 12:28PM

మజ్జి శ్రీనివాస్ అలియాస్ చిన్న శ్రీను వైసీపీ నుంచి వైదొలగడం ఆ పార్టీకి గట్టి షాకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో మజ్జి శ్రీనివాస్ ఎగ్జిట్ వైసీపీకి కొలుకోలేని దెబ్బగా అభివర్ణిస్తున్నారు. ప్రధానంగా మజ్జీ నిర్ణయం వైసీపీ అధినేత జగన్ కు షాక్ అనే చెప్పాలి. మజ్జి తులసీదాస్ వైసీపీ పార్టీకీ, ఆ పార్టీ భిమిని నియోజకవర్గ ఇన్ చార్జ్ పదవికీ, అలాగే పార్టీ కోఆర్డినేటర్ పదవికీ రాజీనామా చేశారు.

మజ్జి శ్రీనివాస్ పొలిటికల్ మూవ్ ఉత్తరాంధ్రలో వైసీపీని దాదాపు ఖాళీ చేసేసిందని పరిశీలకులు అంటున్నారు. అసలింతకీ ఈ మజ్జి శ్రీనివాస్ అలియాస్ చిన్న వైసీపీ సీనియర్ మోస్ట్ నాయకుడు, శాసనమండలిలో వైసీపీ పక్ష నేత, మాజీ మంత్రి అయిన బొత్స సత్యనారాయణకు స్వయానా మేనల్లుడు.
అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కోస్తా ఆంధ్ర ప్రాంతంలో వైఎస్‌ఆర్‌సీపీ కీలక నాయకుడైన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు మేనల్లుడైన చిన్న శ్రీను... వైఎపార్టీ అధినేత జగన్ కు ఇలా రాజీనామా లేఖ ఇచ్చి అలా తెలుగుదేశంగూటికి చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది.
ఇప్పటికే బొత్స జనసేన గూటికి చేరుతారన్న వార్తలు రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారరాయి.ఆ వార్తలను బొత్స సత్యనారాయణ పదేపదే ఖండిస్తున్నా.. వాటికి ఏ మాత్రం ఫుల్ స్టాప్ పడలేదు. ఇక ఇప్పుడు చిన్న శ్రీను వైసీపీకి గుడ్ బై చెప్పడంతో ఆ ప్రచారం జోరందుకుందిమంత్రికి నేరుగా ఫోన్ చేయగలరు లేదా కలవగలరు.
[Majji srinivasarao Join TdP, Goodbye Ycp, Botsa Close rellationm Telugu, One]


