TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రియుడి మోజులో పడి భర్త మర్మాంగాన్ని కోసి హత్య చేసిన భార్య.!

Published on: Thu Oct 22, 2026 3:37PM

జీవితాంతం కలిసుంటామని మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన దంపతుల మధ్య వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. తన సంబంధానికి భర్త అడ్డుగా మారాడని భావించిన ఓ మహిళ.. అతడిపై కక్ష పెంచుకుని చివరకు ప్రాణాలు తీసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మద్యం మత్తులో జరిగిన ఘర్షణ కాస్తా హత్యకు దారితీసిన  ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో  కలకలం రేపింది. నవాబ్‌పేట మండలం తిగులపల్లి గ్రామానికి చెందిన పెద్దమోని శ్రీను (50)కు లక్ష్మమ్మతో 24 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

 జీవనోపాధి కోసం మహబూబ్‌నగర్‌కు వచ్చిన వీరు హనుమాన్‌నగర్‌లో నివాసముంటూ కూలి పనులు చేసుకుంటున్నారు. అయితే లక్ష్మమ్మకు మద్యపానం అలవాటుతోపాటు మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీను భార్యను నిలదీయడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. తన వ్యక్తిగత సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన లక్ష్మమ్మ అతడిపై అసహనం పెంచుకున్నది. ఈ నేపథ్యంలోనే దంపతుల మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి.

 19వ తేదీన భార్యాభర్తల మధ్య గొడవ జరిగిన అనంతరం భర్త శీను మరణించాడు.. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తుండగా భార్య లక్ష్మమ్మపై అనుమానం వచ్చి ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేయడంతో విస్సుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 19వ తేదీ రాత్రి శ్రీను, లక్ష్మమ్మ ఇద్దరూ మద్యం సేవించారు. ఈ క్రమంలో మరోసారి వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ తీవ్రం కావడంతో లక్ష్మమ్మ భర్తను బలంగా తోసివేసింది. 

కిందపడిపోయిన శ్రీనుపై ఆమె దాడికి పాల్పడింది.భర్త మర్మాంగాలపై తీవ్రంగా దాడి చేయడంతోపాటు, సమీపంలో ఉన్న అద్దాన్ని పగలగొట్టి దాని ముక్కతో మర్మంగాన్ని కోసి వేసింది. అంతేకాకుండా అతడి కంటిలో బలంగా పొడిచింది. దీంతో తీవ్ర గాయాలతో శ్రీను అక్కడికక్కడే మృతిచెందాడు. భర్త మరణించిన అనంతరం లక్ష్మమ్మ అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో వెంటనే పోలీసులు లక్ష్మమ్మను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

 

 

 

[ Mahabubnagar Crime, Wife Kills Husband, Extramarital Affair, Illegal Relationship, Husband Murder Case, Telangana Crime News, Nawabpet Mandal, Tigulapalli Village, Lakshmamma, Pedda Moni Srinu, Domestic Dispute, Brutal Murder, Crime News Telugu, Telangana Police ]