TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నకిలీ పత్రాలతో భూముల ఆక్రమణ: కిలేడీ సులోచన అరెస్టు.!

Published on: Thu Nov 5, 2026 9:08AM

నకిలీ రికార్డులను సృష్టించి విలువైన భూములను ఆక్రమించుకున్న మదనపల్లెకు చెందిన కిలేడి, రౌడీషీటర్ కోనేటి సులోచనను పోలీసులు అరెస్టు చేశారు.  ఈ కేసుకు సంబంధించి సులోచనతో పాటు మరో ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.   నకిలీ పత్రాల సృష్టి, అక్రమ రిజిస్ట్రేషన్లు,  భూములు ఆక్రమణ వంటి ఎదుర్కొంటున్న సులోచన అరెస్టు స్థానికంగా సంచలనం సృష్టించింది. 

ఈ కేసుకు సంబంధించి బాధితుడు మార్పూరి శ్రీరామ్   ఫిర్యాదు మేరకు.. తన భూమిని తన   పెద్దనాన్న కుమారుడు మార్పురి వెంకటేష్ కు 2023లో రాసిచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించి,  డప జిల్లా పులివెందుల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కోనేటి సులోచన ఆ భూమిని  అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 

అంతటితో ఆగకుండా, సదరు భూమిలోకి అక్రమంగా ప్రవేశించిన నిందితులు అక్కడ ఉన్న ఆస్తులను   ధ్వంసం చేసి బలవంతంగా తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా  దర్యాప్తు చేపట్టిన పోలీసులు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు.  ఇప్పటికే వేరే కేసులో మదనపల్లె సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న కోనేటి సులోచనతో పాటు ఆమె అనుచరుడు గుండిగల మోహన్, రెడ్డెప్పనాయుడు కాలనీకి చెందిన రియల్టర్ కడియాల శ్రీరాములు నాయుడులను పోలీసులు పీటీ వారెంట్‌పై అరెస్టు చేశారు.

ఈ కేసులో ప్రమేయం ఉన్న మిగతా నిందితుల కోసం పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరో ఎనిమిది మందిని త్వరలోనే అరెస్టు చేయాల్సి ఉందని  పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితురాలైన కోనేటి సులోచనతో పాటు కడియాల శ్రీరాములు నాయుడులపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో పలు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు   వెల్లడించారు. 

[Madanapalle Lady Don Koneti Sulochana Arrest, Fake Documents,  Kadapa District, Pulivendula, Madanapalle Rowdy Sheeter Sulochana]