బంగాళాఖాతంలో మరో అల్పపీడం: తుపానుగా మారే అవకాశం.. ఏపీకి ముప్పు లేదు.!
Published on: Wed Nov 11, 2026 3:55PM

బంగాళా ఖాతంలో మరో అప్పపీడనం ఏర్పడిందన్న వార్త వరుస తుపానులతో ఇప్పటికే అతలాకుతలమైన ఏపీ ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పటికే రోజుల వ్యవధిలో అర్నాబ్, మురసు తుపానులతో ఏపీలో భారీ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే.
అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే రహదారులపై చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి, రవాణా వ్యవస్థ దాదాపు స్తంభించింది. ఇక వేల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరా అస్తవ్యస్థంగా మారింది
ఆ ఇబ్బందులు, ఇక్కట్లను ఇప్పుడిప్పుడే అధిగమించి గాడిన పడుతున్న ఆంధ్రప్రదేశ్ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అనే సరికి బెంబెలెత్తుతోంది. దక్షిణ అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
.webp)
ఇది వాయువ్య దిశగా పయనిస్తూ శనివారం నాటికి స్పష్టమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉందనీ, . ఆ తర్వాత ఆదివారం నాటికి అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో శనివారం నుంచి మంగళవారం వరకూ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కంది.
ఇది చదవండి: ఏపీకి మురసు ముప్పు: ఒంగోలు సమీపంలో తీరం దాటనున్న తీవ్ర తుపాను.!
మత్స్యకారులు ఆగ్నేయ, నైరుతి, మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోకి వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తతం ఈ వాయుగుండం వల్ల ఏపీకి ఎటువంటి ముప్పూ లేదని పేర్కొన్న వాతావరణ శాఖ.. రానున్న రోజుల్లో ఇది ఏటు వైపు పయనిస్తుందనే అంశంపై స్పష్టత వస్తుందని తెలిపింది.
.webp)
ఏపీకి ముప్పులేనప్పటికీ, శనివారం నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అంచనాతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టుప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని పేర్కొంది.
మీకు నచ్చవచ్చు: మురసు తుపాను నష్టాలపై సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే.!
[Low pressure in Bayofbengal, Cyclone, Heavy, Rains, AP, Alert, Telugu One]


