TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆ సమయంలో కారు నడుపుతున్నది నా కుమారుడే.!

Published on: Sat Aug 22, 2026 10:24AM

హైదరాబాద్‌  మాదాపూర్ పరిధిలో ఆగస్టు 16, 2026న జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్  ఎట్టకేలకు మౌనం వీడారు. తన కుమారుడు లింగమనేని సంజూష్ నడుపుతున్న  కారు ప్రమాదానికి గురై,  26 ఏళ్ల యువతి దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోవడంపై   విచారం వ్యక్తం చేసిన ఆయన మరణించిన యువతి కుటుంబానికి   సానుభూతిని తెలియజేశారు.  ఆ కుటుంబానికి  అండగా ఉంటామన్నారు. ఈ విషాద సంఘటనపై సోషల్ మీడియాలో ముందస్తు తీర్పులు ఇవ్వవద్దని కోరారు.   

ప్రమాదం జరుపుతున్న సమయంలో కారు నడుపుతున్నది తన కుమారుడేనని ధృవీకరించారు.  ప్రమాదం జరిగిన వెంటనే సంజూష్  గాయపడిన ఆ యువతిని   ఆసుపత్రికి తరలించాడనీ,  సంబంధిత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ప్రమాదం గురించి సమాచారం అందించారని వివరించారు. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యాయని, పోలీసులు సంజూష్‌పై కేసు నమోదు చేసి  విచారణ జరుపుతున్నారన్న లింగమనేని రమేష్..  ఈ ప్రమాదం అనంతరం సంజూష్‌కు   మూడు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారనీ ఆ పరీక్షలలో సంజూష్, నిషిద్ధ పదార్థాలు లేదా మద్యం తాగి వాహనం నడపలేదని తేలిందని చెప్పారు.

ఈ కేసులో తన కుమారుడికి స్టేషన్ బెయిల్ మంజూరు చేశాన్నారు.  విచారణ పూర్తయి నిజానిజాలు బయటకు వచ్చే వరకు   బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, న్యాయ ప్రక్రియ తన పని తాను చేసుకుపోవడానికి సహకరించాలని లింగమనేని రమేష్ కోరారు. 

Lingamaneni Ramesh Breaks silence, Lingamaneni Sanjush Accideny, Janasena MP, Madhapur car crash,  Sanjush medical test reports