TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బాబోయ్ చిరుత.. తిరుమల నడకదారి భక్తుల్లో భయం భయం.!

Published on: Thu Sep 10, 2026 7:31AM

తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు  అలిపిరి నడక మార్గం ద్వారా వెడతారు. అయితే మార్గంలో  తరచూ వన్యమృగాల సంచారం వారి భద్రతను ప్రశ్నార్ధకం చేస్తున్నది. ఎప్పటికప్పుడు అటవీశాఖ, టీటీడీ నడకమార్గంలో వన్యమృగాల సంచారాన్ని నిరోధించడానికి చర్యలు చేపడుతున్నా ఫలితం ఉండటం లేదు. తాజాగా అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. భక్తులను భయాందోళనలకు గురి చేస్తోంది. 

 తాజాగా  మెట్ల మార్గంలో 7వ మైలు దాటిన తర్వాత ఒక మండపం సమీపంలో చిరుతను గమనించిన భక్తులు భయంతో కేకలు వేశారు. వారి అరుపులకు అది అడవిలోకి పరుగులు తీసింది. . అంతకు ముందు  రెండు రోజుల క్రితం కూడా  నడకమార్గంలోని నరసింహస్వామి ఆలయానికి సమీపంలోనూ చిరుత సంచరించింది. ఇలా వరుసగా వెలుగుచూస్తున్న ఘటనలతో నడక మార్గంలో  తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు భయాందోళనలకు గురౌతున్నారు.  

కాగా చిరుత సంచారం సమచారంతో టీటీడీ, అటవీ శాఖ అప్రమత్తమయ్యాయి.  నడక మార్గంలో భక్తులు   ఒంటరిగా వెళ్లొద్దంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలిపిరి నడకమార్గంలో భక్తులను గుంపులు గుంపులుగా మాత్రమే అనుమతిస్తున్నారు.  చిరుత సంచారం కనిపించిన ప్రాంతంలో భద్రతను పెంచారు.  రాత్రి సమయాల్లోనే కాకుండా పగటిపూట కూడా నిఘా పెంచారు. భక్తులు  ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ,  అధికారుల సూచనలను పాటించాలనీ కోరారు.    


[Leopard, Alipiri walkway, Tirumala Leopard Sighting, Alipiri Footpath, TTD Vigilance Safety, Telugu One]