రేప్ చేస్తే కాళ్లు, చేతులు కట్...

 

అత్యాచారాలు చేసే వాళ్ల కాళ్లు, చేతులు తీసేయాలని పలువురు ఆంధ్రప్రదేశ్ మహిళా ఎమ్మెల్సీలు అన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాల మీద ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సోమవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మహిళల కోసం 1090 హెల్ప్లైన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలపై దాడులను అరికట్టడానికి బహిరంగ చట్టాలు తేవాలని పలువురు ఎమ్మెల్సీలు కోరారు. ఈ దాడులకు పాల్పడేవాళ్లకు బెయిల్ ఇవ్వడం సరికాదని మాజీ మంత్రి సి.రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు.