ఎల్ కే అద్వానీకి అస్వస్థత: ఆస్పత్రిలో చేరిక.!
Published on: Mon Oct 19, 2026 11:22AM

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, దేశ మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వయస్సు సంబంధిత ఆరోగ్య సమస్యలు, శ్వాస కోశ ఇన్ ఫెక్షన్ కారణంగా ఆయనను ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.
ఆసుపత్రిలోని పల్మనరీ మరియు న్యూరాలజీ విభాగాలకు చెందిన సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో అద్వానీకి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని, అవసరమైన పరీక్షలు అన్నీ నిర్వహిస్తున్నామని ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులిటిన్ పేర్కొంది. అద్వానీ వయస్సు 98 ఏళ్లు.

ఆయన గత కొంతకాలంగా వయోభార సమస్యలతో బాధపడుతున్నారు. అద్వానీ అస్వస్థతకు గురయ్యారన్న వార్త తెలిసిన వెంటనే పలువురు రాజకీయ ప్రముఖులు, బీజేపీ నాయకులు ఆస్పత్రికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆయన కోట్లాది మంది అభిమానులు మరియు పార్టీ కార్యకర్తలు ఆయన ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థిస్తున్నారు.
[Lal Krishna Advani Fell Ill, Advani's health, Apollo Hospital Delhi,Senior BJP leader, Former Prime Minister, Telugu One]


