రెండేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పక్కా: అప్పుడు అందరి లెక్కలు తేలుస్తాం : కేటీఆర్
Published on: Sun Sep 27, 2026 2:34PM
.webp)
పోయింది అధికారం మాత్రమే.. కేసీఆర్‌పై అభిమానం తగ్గలేదు.!
కేవలం రెండేళ్ల వ్యవధిలోనే రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే గతంలో జరిగిన ప్రతిఘటనలు, అక్రమాలు అధికారుల తీరుపై సమగ్ర విచారణ జరిపించి అందరి లెక్కలు ఒకరి తరువాత ఒకరు తేలుస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు
గత కొంతకాలంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో పోలీస్ ప్రభుత్వ ఉన్నతాధికారుల వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇదే కోవలో స్పందించిన కేటీఆర్, చట్టాన్ని అతిక్రమించి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న అధికారులు నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. ఎవరెవరు ఏవిధంగా వ్యవహరిస్తున్నారో తమ పార్టీ తరఫున పక్కాగా రికార్డు చేస్తున్నామని, భవిష్యత్తులో పరిస్థితులు మారినప్పుడు ప్రతి ఒక్కరి బాధ్యతను గుర్తు చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
ప్రజాస్వామ్యయుతంగా ప్రజల మధ్యలోకి వెళ్తామని, రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా, బహిరంగ సభల ద్వారా ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెస్తామని హెచ్చరించారు. కేటీఆర్ చేసిన ఈ తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గణేశ్ నిమజ్జనం పూర్తయిన తర్వాత ఇక ప్రశాంతంగా ఉండొచ్చని సీ రేవంత్‌రెడ్డి అనుకున్నారు.. కానీ మరో సినిమా వచ్చి మళ్లీ ఇబ్బందుల్లో పడేసిందని బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తాను, జగదీశ్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి తదితరులు కలిసి ఆ సినిమా చూశామని కేటీఆర్ తెలిపారు. సినిమా మొత్తం మూడు గంటల పాటు సాగితే.. అందులో కేసీఆర్ కనిపించింది కేవలం నాలుగు నిమిషాలేనని అన్నారు. అయితే ఆ మూడు గంటలు ఒక ఎత్తయితే.. కేసీఆర్ కనిపించిన ఆ నాలుగు నిమిషాలు మరో ఎత్తుగా నిలిచాయని పేర్కొన్నారు.
ఆ సినిమా తీసిన వారు, అందులో నటించిన వారు తమ పార్టీకి సంబంధం లేని వ్యక్తులేనని కౌశిక్‌రెడ్డి అన్నారు. అయినప్పటికీ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం పోరాడిన నాయకుడిగా, ప్రజలకు గొంతుకగా నిలిచిన నేతగా కేసీఆర్‌ను తెలంగాణ సమాజం ఎలా గుర్తు చేసుకుంటుందో ఆ సినిమాలో స్పష్టంగా కనిపించిందని కేటీఆర్ చెప్పారు.కేసీఆర్‌ను చూసి ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదని, భయపడాల్సిన అవసరం కూడా లేదని కౌశిక్‌రెడ్డి అన్నారు. పోయింది కేవలం అధికారం మాత్రమేనని.. ప్రజల్లో కేసీఆర్‌పై ఉన్న అనురాగం, మమకారం ఏమాత్రం తగ్గలేదని కేటీఆర్ పేర్కొన్నారు.తెలంగాణలో ప్రజలు ప్రతి అడుగులోనూ కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారని కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల్లో కేసీఆర్‌పై అభిమానం ఇంకా అలాగే ఉందనడానికి ఈ పరిణామాలే నిదర్శనమని కేటీఆర్ అన్నారు.
[ KTR warning, BRS party, Telangana politics, KCR government, KTR comments, latest Telugu news, CM Revanth Reddy,Telangana Politics, Telangana Government, BRS Leaders,Telugu One, Telugu News ]


